ప్యాట్ కమ్మిన్స్, బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, బట్లర్...ఐపీఎల్ 2021 ఫేజ్ 2కి డుమ్మా కొట్టిన ప్లేయర్లు వీరే...

First Published Sep 19, 2021, 6:24 PM IST

ఐపీఎల్ లాంటి క్రికెట్ టోర్నీలో ఆడే అవకాశం రావడమే పెద్ద అదృష్టంగా భావించి, ఎగిరి గంతేస్తూ ఉంటారు ప్రపంచదేశాల క్రికెటర్లు. ఒక్క మ్యాచ్‌లో క్లిక్ అయితే చాలు, తమ జాతకమే మారిపోతుందనే నమ్మకం, ఆశా వారివి. అయితే కొందరు క్రికెటర్లు మాత్రం అనివార్య కారణాల వల్ల ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో ఆడినా, ఫేజ్‌2కి దూరమయ్యారు... వాళ్లు ఎవ్వరంటే...

వాషింగ్టన్ సుందర్: ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో ఆరు మ్యాచులు ఆడి 3 వికెట్లు తీయడంతో పాటు మూడు వికెట్లు కూడా తీశాడు. అయితే ఇంగ్లాండ్ టూర్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన సుందర్, ఫేజ్ 2 మొత్తానికి దూరమయ్యాడు...

ప్యాట్ కమ్మిన్స్: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్లలో ఒకడైన కేకేఆర్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్, ఫస్టాఫ్‌లో 7 మ్యాచులు ఆడి 9 వికెట్లు తీసి, బ్యాటుతో 93 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే అతని భార్య ప్రసవ సమయం దగ్గర పడడంతో కమ్మిన్స్, ఫేజ్ 2లో పాల్గొనడం లేదు...

ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్: ఆసీస్ ప్లేయర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, ఐపీఎల్ 2021 సీజన్ ఆడేందుకు భారత్‌కి వచ్చారు. అయితే సెకండ్ వేవ్‌ పరిస్థితులను చూసి, భయపడి అర్ధాంతరంగా టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యారు. వీరిలో ఆడమ్ జంపా ఫేజ్ 1లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కేన్ రిచర్డ్‌సన్ మాత్రం ఓ మ్యాచ్ ఆడాడు...

డానియల్ సామ్స్: ఐపీఎల్ 2021 వేలంలో డానియల్ సామ్స్‌ను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ, ఫస్టాఫ్‌లో 2 మ్యాచులు ఆడి ఓ వికెట్ తీశాడు. అయితే వ్యక్తిగత కారణాలతో సామ్స్ ఈసారి బరిలో దిగడం లేదు...

ఫిన్ ఆలెన్: యంగ్ వికెట్ వికెట్ కీపర్ జోష్ ఫిలిప్‌కి రిప్లేస్‌మెంట్‌గా న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ ఆలెన్‌ను తీసుకుంది ఆర్‌సీబీ. అయితే అతను ఫస్టాఫ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సెకండాఫ్‌లోనూ బరిలో దిగడం లేదని ప్రకటించాడు...

జోస్ బట్లర్: ఫస్టాఫ్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి భారీ స్కోరు అందించిన జోస్ బట్లర్, తొలి సగంలో 254 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ మధ్యనే బట్లర్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అతను ఐపీఎల్ ఫేజ్ 2కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు...

ఆండ్రూ టై: ఆర్‌సీబీ ప్లేయర్ ఆడమ్ జంపాతో పాటు కరోనా సెకండ్ వేవ్‌ను చూసి భయపడి, స్వదేశానికి పయనమైనవారిలో ఆండ్రూ టై కూడా ఒకడు. ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్ 2లో కూడా అతను పాల్గొనడం లేదు...

బెన్ స్టోక్స్: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే క్యాచ్ అందుకుంటూ గాయపడ్డాడు బెన్ స్టోక్స్. ఆ కారణంగా ఫస్టాఫ్‌లో మిగిలిన మ్యాచులు ఆడలేదు. ఇప్పుడు మెంటల్ హెల్త్ కోసం బ్రేక్ తీసుకోవడంతో సెకండాఫ్‌లోనూ కనిపించడం లేదు...

డేవిడ్ మలాన్: నెం.1 టీ20 ప్లేయర్ డేవిడ్ మలాన్, ఫస్టాఫ్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 26 పరుగులు చేశాడు. అయితే టీమిండయా, ఇంగ్లాండ్ టూర్‌లో ఐదో టెస్టు రద్దు చేసుకోవడంతో ఫీలైన డేవిడ్ మలాన్, ఐపీఎల్ పాల్గొనడం లేదని ప్రకటించాడు...

జై రిచర్డ్ సన్, రిలే మెరిడిత్: ఆస్ట్రేలియా యంగ్ బౌలర్ జే రిచర్డ్‌సన్ ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో 3 మ్యాచులు ఆడి 3 వికెట్లు తీయడంతో పాటు 15 పరుగులు చేశాడు. రిలే మెరిడిత్ 5 మ్యాచులు ఆడి, నాలుగు వికెట్లు తీశాడు. ఈ ఇద్దరూ కూడా ఫేజ్ 2లో ఆడడం లేదు...

క్రిస్ వోక్స్: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, ఫస్టాఫ్‌లో 3 మ్యాచులు ఆడి 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే ఐదో టెస్టు రద్దుకావడంతో అలిగి, ఫేజ్ 2 నుంచి తప్పుకున్నవారిలో క్రిస్ వోక్స్ కూడా ఉన్నాడు...

జానీ బెయిర్‌స్టో:  ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో 7 మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో, 248 పరుగులు చేసి సన్‌రైజర్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఐదో టెస్టు రద్దు చేసుకోవడంతో భారత జట్టుపై అలిగి, ఫేజ్ 2కి దూరమైన ప్లేయర్లలో బెయిర్ స్టో కూడా ఒకడు...

click me!