స్పా, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ బీచ్... ఐపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల కోసం...

First Published Aug 13, 2021, 6:35 PM IST

ఐపీఎల్‌ కెరీర్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్. గత 8 సీజన్లలో 5 సార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్. అసలు ముంబై సక్సెస్ సీక్రెట్ ఏంటని తెలుసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి మిగిలిన జట్లు...

ఆటగాళ్లతో పాటు వారి ఫ్యామిలీలకు ఎలాంటి లోటు లేకుండా, చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అత్యాధునిక సౌకర్యాలను సమకూరుస్తూ... క్రికెటర్ల మెప్పు పొందుతోంది ముంబై ఇండియన్స్...

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్‌2 కోసం యూఏఈలో తమ జట్టు సభ్యులు, వారి ఫ్యామిలీల కోసం ఓ లగ్జరీ హోటెల్‌ను బుక్ చేసింది ముంబై ఇండియన్స్. అబుదాబిలోని సెయింట్ రెజిస్ హోటల్‌ను బుక్ చేసింది ముంబై ఇండియన్స్...

ఈ హోటల్‌లో ముంబై ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా ఇరిడియం స్పా, లగ్జరీ ఇండోర్ లాప్ పూల్, ది సెయింట్ రెజిస్ అథ్లెటిక్ క్లబ్, అవుట్‌డోర్ పూల్స్‌తో పాటు అనేక సౌకర్యాలు ఉంటాయి...

ఆటతో పాటు సేద తీరేందుకు బయో బబుల్ రూల్స్ బ్రేక్ కాకుండా ప్రైవేట్ అబుదాబీ బీచ్‌తో పాటు సముద్రాన్ని వీక్షిస్తూ డిన్నర్ చేసేందుకు సకల ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి..

వీటితో పాటు మీటింగ్స్ పెట్టుకునేందుకు, బర్త్ డే, మ్యాగేజ్ డే వంటి ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసింది ముంబై ఇండియన్స్...

ఈ సౌకర్యాల కల్పన కోసం ఒక్కో ప్లేయర్ పైన రోజుకి దాదాపు రూ.25 వేలు ఖర్చు చేస్తోంది ముంబై ఇండియన్స్. ఆగస్టు 20 నుంచే యూఏఈలో ముంబై ఇండియన్స్ క్యాంపు మొదలుకానుంది...

సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో ముంబై ఇండియన్స్, తమ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది...

31 మ్యాచుల ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ కోసం దాదాపు 60 రోజుల పాటు యూఏఈలో బస చేయనుంది ముంబై ఇండియన్స్ జట్టు. అంటే ఈ 60 రోజుల కోసం ఒక్కో ప్లేయర్ మీద ఆ ఫ్రాంఛైజీ చేయబోయే ఖర్చు అక్షరాల 15 లక్షల రూపాయలు...

కేరింగ్ విషయంలో ముంబై ఇండియన్స్ తర్వాత ఏ జట్టైనా అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈ సీజన్‌లోనూ టైటిల్ సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది...

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేకులు పడే సమయానికి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. మొదటి ఐదు మ్యాచుల్లో మూడింట్లో ఓడిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో కమ్‌బ్యాక్ ఇచ్చింది...

click me!