INDvsENG 2nd Test: భారీ స్కోరు దిశగా భారత జట్టు... జడేజా చెలరేగితే...

Published : Aug 13, 2021, 05:36 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి  టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది.. ఓవర్‌నైట్ స్కోర్ 276/3 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, మొదటి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయింది.. 

PREV
16
INDvsENG 2nd Test: భారీ స్కోరు దిశగా భారత జట్టు... జడేజా చెలరేగితే...

తొలి రోజు ఓపెనర్ రోహిత్ శర్మ 145 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 83 పరుగులు చేయగా, ఛతేశ్వర్ పూజారా 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. 103 బంతుల్లో 3 ఫోర్లతో 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, తొలి రోజు ఆట చివర అవుట్ అయ్యాడు.

26

250 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో 129 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, రెండో రోజు తాను ఎదుర్కొన్న రెండో బంతికే అవుట్ అయ్యాడు. ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో సిబ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరిన కెఎల్ రాహుల్, లార్డ్స్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

36

రాహుల్ అవుటైన తర్వాత కొద్దిసేపటికే అజింకా రహానే కూడా పెవిలియన్ చేరాడు. నిన్న 22 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసిన రహానే... నేడు తాను ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అయ్యాడు. అండర్సన్ బౌలింగ్‌లో మొదటి బంతికే జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రహానే.

46

282 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం అందించారు...

56

58 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసిన రిషబ్ పంత్... మార్క్ వుడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పంత్ అవుటైన తర్వాత మహ్మద్ షమీ, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...

66

మహ్మద్ షమీ వికెట్, మొయిన్ ఆలీకి టెస్టుల్లో భారత్‌కి 50వ వికెట్ కావడం విశేషం. ఇషాంత్ శర్మ 7 బంతుల్లో పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉంటే రవీంద్ర జడేజా 86 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులతో ఆడుతున్నాడు.

click me!

Recommended Stories