IPL 2021: ఆఖరికి ముంబై ఇండియన్స్‌లో మిగిలేది ఆ ముగ్గురే... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

First Published Oct 10, 2021, 4:49 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ కథ క్లైమాక్స్‌కి చేరుకుంది. ప్లేఆఫ్స్‌ ప్రారంభమై, ఫైనల్ విజేత ఎవరో అతిత్వరలోనే తేలనుంది... దీంతో అందరిదృష్టి ఐపీఎల్ 2022 మెగా వేలంపై పడింది...

గత 8 సీజన్లలో ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. నెట్ రన్‌రేట్ తక్కువగా ఉన్న కారణంగా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది...

మిగిలిన జట్లతో పోలిస్తే ముంబై ఇండియన్స్‌‌లో మ్యాచ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, రాహుల్ చాహార్, జయంత్ యాదవ్ వంటి స్వదేశీ స్టార్లతో పాటు విదేశీ స్టార్లకు కొదువ లేదు..

డి కాక్, కిరన్ పోలార్డ్, ట్రెంట్ బౌల్డ్, జేమ్స్ నీశమ్, నాథన్ కౌంటర్‌నైల్, క్రిస్ లీన్ వంటి ప్లేయర్లు ముంబై ఇండియన్స్‌లో ఉన్నారు..

అయితే ఈ ప్లేయర్లందరికీ ఒక్క టీమ్‌లో చూసే ఛాన్స్, వచ్చే సీజన్‌లో ఉండదు. ఎందుకంటే 2022 సీజన్‌లో అదనంగా మరో రెండు జట్లు ఎంట్రీ ఇస్తుండడంతో మెగా వేలం నిర్వహించబోతున్నారు...

మెగా వేలానికి సంబంధించిన నియమ, నిబంధనలు ఇంకా రాకపోయినా, రిటెన్షన్ పాలసీలో మహా అయితే ముగ్గురు స్వదేశీ ప్లేయర్లను, ఇద్దరు లేదా ముగ్గురు విదేశీ ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు ఫ్రాంఛైజీలకు అవకాశం ఉండొచ్చని అంచనా...

ముంబై ఇండియన్స్‌లో ఉన్న ప్లేయర్లలో ఏ ముగ్గురిని జట్టు రిటైన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు...

‘నాకు తెలిసి ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలను రిటైన్ చేసుకుంటుంది. ఇషాన్ కిషన్ వయసు తక్కువ కావడంతో సుదీర్ఘకాలం జట్టుకి అందుబాటులో ఉంటాడు...

హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అదీకాక అతన్ని గాయాలు వేధిస్తున్నాడు. ఈ రెండూ లెక్కలోకి తీసుకుంటే హార్ధిక్ పాండ్యాకి వేలంలో పెద్దగా ధర పలకకపోవచ్చు...

బౌలింగ్ చేయకపోయినా ఫిట్‌గా ఉంటే మాత్రం హార్ధిక్ పాండ్యాను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపిస్తాయి... అయితే హార్ధిక్‌ని ముంబై రిటైన్ చేసుకోవడం కష్టమే...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఇషాన్ కిషన్ ఇచ్చిన పర్ఫామెన్స్ చూసిన తర్వాత అతని నుంచి భవిష్యత్తులో ఇలాంటివి చాలా చూడొచ్చనే నమ్మకం కలిగింది... 

అతన్ని వేలానికి వదిలేస్తే మిగిలిన జట్లకి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. జస్ప్రిత్ బుమ్రా లాంటి బౌలర్‌ను వదులుకోవడానికి ఏ జట్టూ ఇష్టపడదు...

అలా చూసుకుంటే... వచ్చే ఏడాది ముంబై ఇండియన్స్‌లో మిగిలేది ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రాలే అనిపిస్తోంది... మిగిలినవారిలో ఎంతమందిని వేలంలో కొని వెనక్కి తెచ్చుకుంటారో చూడాలి...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీల్లో ఒక్కటైన ముంబై ఇండియన్స్, ఇప్పటివరకూ ఏ ప్లేయర్‌ కోసం ఐపీఎల్ వేలంలో రూ.10+ కోట్లు వెచ్చించింది లేదు... 

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అత్యధిక మొత్తం వెచ్చించింది రోహిత్ శర్మ కోసమే. 2011 వేలంలో రోహిత్‌ను రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...

తక్కువకి ప్లేయర్లని కొని, వారిని స్టార్లుగా మలుచుకోవడమే ముంబై ఇండియన్స్ పాలసీ. అయితే హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహార్ వంటి ప్లేయర్లకు మెగా వేలంలో 10+ ధర ఈజీగా దక్కే అవకాశం ఉంది...

click me!