టైటిల్ కొడితే రూ.12 కోట్లు, ఓడినా కూడా... టీ20 వరల్డ్‌కప్ 2021 ప్రైజ్‌మనీ వివరాలివే...

First Published Oct 10, 2021, 4:11 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరిగే ఈ టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)...

2021 టీ20 వరల్డ్‌కప్ టైటిల్ విజేతలకు ప్రైజ్ మనీ రూపంలో రూ.12 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) లభిస్తుంది. అలాగే ఫైనల్‌లో ఓడి, రన్నరప్‌గా నిలిచిన జట్టుకి అందులో సగం అంటూ రూ.6 కోట్లు ప్రైజ్‌మనీ అందుతుంది...

రౌండ్ 1లో గెలిచిన జట్లకి ఒక్కో జట్టుకి రూ.30 లక్షలు (40 వేల డాలర్లు)  దక్కుతాయి. నమీబియా, నెదర్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఓమన్, పపువా న్యూ గియా, స్కాట్లాండ్, శ్రీలంక జట్లు గ్రూప్ స్టేజ్‌లో పోటీ పడబోతున్నాయి...

రౌండ్‌ 2లో ఓడిన జట్లకి ఒక్కో టీమ్‌కి రూ.52.59 లక్షలు (70 వేల డాలర్లు) అందుతుంది... గ్రూప్ రౌండ్‌లో టేబుల్ టాపర్లుగా నిలిచిన రెండు జట్లతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఈ మొత్తాన్ని అందుకోనున్నాయి...

సూపర్ 12లో టేబుల్ టాపర్లుగా నిలిచిన రెండేసి జట్లు, సెమీ ఫైనల్ చేరుకుంటాయి. మొత్తంగా నాలుగు జట్ల మధ్య సెమీస్ జరుగుతుంది. సెమీ ఫైనల్ చేరి, సెమీస్‌లో ఓడిన ఒక్కో జట్టుకి రూ.3 కోట్లు (4 లక్షల డాలర్లు) దక్కుతాయి... 

సెమీ ఫైనల్‌లో విజయం సాధించి, ఫైనల్ చేరితే... విజేతకి టైటిల్‌తో పాటు రూ.12 కోట్లు, రన్నరప్‌కి రూ.6 కోట్ల నగదు బహుమతి దక్కనుంది...

ఐపీఎల్ ప్రైజ్‌మనీ (గత ఏడాది రూ.20 కోట్లు)తో పోలిస్తే ఇది తక్కువగా, ఆర్థికంగా అనేక కష్టాలు ఎదుర్కొంటున్న నమీబియా, నెదర్లాండ్స్ వంటి దేశాలకు ఈ ప్రైజ్‌మనీ... చాలా విలువైనది.

click me!