IPL 2021: ఆ నలుగురు నాలో కాన్ఫిడెన్స్ పెంచారు.. కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ తర్వాత ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Oct 06, 2021, 05:27 PM IST

Ishan Kishan: ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్.. మంగళవారం నాడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో రెచ్చిపోయాడు.  ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయి ముంబైకి సునాయస విజయాన్ని సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. 

PREV
18
IPL 2021: ఆ నలుగురు నాలో కాన్ఫిడెన్స్ పెంచారు.. కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ తర్వాత ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

IPL-14 సీజన్ సెకండ్ ఫేస్ లో తొలి నాలుగు మ్యాచుల్లో దారుణంగా విఫలమై ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన Mumbai indians బ్యాట్స్మెన్ ఇషాంత్ కిషన్.. నిన్నటి మ్యాచ్ లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 

28

అంతకుముందు మూడు మ్యాచులలో కలిపి 24 పరుగులే చేసిన ఈ డాషింగ్ క్రికెటర్.. Rajasatan Royals తో జరిగిన పోరులో 25 బంతుల్లోనే 50 పరుగులు బాదాడు. 

38

అయితే వరుసగా విఫలమవుతున్న సందర్భంలో బాధతో కుంగిపోయిన తనలో నలుగురు సీనియర్ ఆటగాళ్లు, ముంబై టీమ్ సపోర్టు స్టాఫ్ మద్దతుగా నిలిచారని తెలిపాడు. 

48

ముఖ్యంగా భారత జట్టు కెప్టెన్ Virat kohli, ముంబై ఇండియన్స్ కెప్టెన్ Rohit sharma, అదే జట్టులో ఉన్న  హార్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ లు తనకు విలువైన  సలహాలు, సూచనలు చెప్పారని 23 ఏండ్ల కిషన్ అన్నాడు. 

58

ఏ ఆటలో అయినా ఆటగాళ్లకు ఎత్తుపల్లాలు సహజమని, దానికి తానూ అతీతుడిని కాదని కిషన్ చెప్పాడు. ‘నేను విరాట్ భాయ్ తో మాట్లాడాను. రోహిత్ భాయ్, హర్ధిక్ అన్న, కీరన్ పొలార్డ్ లతో మాట్లాడాను. ఈ సందర్భంగా వాళ్లు నాకు మద్దతుగా నిలిచారు. నా లోపాలను నాకు చెప్పి వాటిని ఎలా అధిగమించాలో చెప్పారు’ అని అన్నాడు. 

68

‘విరాట్ భాయ్ తో మాట్లాడటం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.  పొలార్డ్ నన్ను నాలా ఆడామని చెప్పాడు. నేను గతంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వీడియోలు చూడమని అన్నాడు. వాటిని చూడటం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని కిషన్ చెప్పుకొచ్చాడు. 

78

వాళ్ల మాటలు తనకు మళ్లీ పుంజుకోవడానికి అవకాశమిచ్చాయని కిషన్ వివరించాడు. మళ్లీ ఓపెనర్ గా వచ్చి జట్టుకు అవసరమైన పరుగులు చేయడం సంతోషాన్నిచ్చిందని అన్నాడు.

88

గతేడాది ముంబై జట్టు తరఫున iplలో అదరగొట్టిన ఇషాన్ ను ఈసారి T20 World cup కోసం భారత జట్టులో ఎంపిక చేశారు. అయితే అతడి ఫామ్ ను చూసి చాలా మంది bcci బోర్డు సభ్యుల నిర్ణయంపై విమర్శలు గుప్పించారు.  

click me!

Recommended Stories