సన్ రైజర్స్ బౌలర్ Umran Malikకు బంపరాఫర్.. టీ20 వరల్డ్ కప్ ముగిసేదాకా టీమిండియాతోనే ఉండాలని ఆదేశాలు..!

First Published Oct 10, 2021, 12:09 PM IST

Umran Malik: సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రన్ మాలిక్ కు బంపరాఫర్. ఐపీఎల్ లో అదరగొట్టిన ఈ జమ్మూ ఎక్స్ప్రెస్.. యూఏఈ వేదికగా జరుగనున్న T20 World Cup ముగిసేదాకా టీమిండియాతో ఉండనున్నాడు. 

జమ్మూ కుర్రాడు.. సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రన్ మాలిక్ కు బంపరాఫర్. ఐపీఎల్ లో ఆడిన రెండు మ్యాచ్ లకే తన సత్తా చాటిన ఉమ్రన్.. ఇప్పుడు ఏకంగా టీమిండియాకు ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు.

త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కోసం భారత నెట్ బౌలర్ గా ఉమ్రన్ మాలిక్ ఎంపికైనట్టు బీసీసీఐ వర్గాల సమాచారం.  

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వెళ్లడంలో విఫలమైన హైదరాబాద్ ఆటగాళ్లు.. స్వదేశానికి తిరిగి రావడానికి పయనమయ్యారు. కానీ ఉమ్రన్ ను మాత్రం అక్కడే ఉండాలని బీసీసీఐ పెద్దలు ఇప్పటికే అతడిని ఆదేశించినట్టు తెలుస్తున్నది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో ఏకంగా గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరిన ఉమ్రన్ ప్రతిభను చూసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.. అతడిని భారత నెట్ బౌలర్ గా ఉండనివ్వాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తున్నది. 

ఇది కూడా చదవండి: తండ్రి కూరగాయల వ్యాపారి.. కొడుకు ఈ ఐపీఎల్ సీజన్ లోనే అత్యంత వేగంగా బంతులు వేసిన బౌలర్..

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన నేడు ప్రకటించాల్సి ఉన్నది. అయితే ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘అవను.. ఉమ్రన్ టీమిండియాతోనే ఉంటాడు. అతడు రేపో, ఎల్లుండో టీమిండియా బయోబబుల్ లో జాయిన్ కావాలంటూ ఉమ్రన్ కు తెలిపాం’ అని వ్యాఖ్యానించాడు. 

టీ20 ప్రపంచకప్ లో ఆడకపోయినప్పటికీ ఐసీసీ లాంటి మేజర్ టోర్నీకి నెట్ బౌలర్ గా వ్యవహరించడమేని చిన్న విషయమేమీ కాదు. ఒకవేళ టీమిండియాలో ఎవరైనా బౌలర్ గాయపడితే ఉమ్రన్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉంది. 

ఏమో మరి..  అదృష్టం వరిస్తే ఉమ్రన్ ఈ టోర్నీలో బౌలింగ్ వేసే అవకాశం దక్కించుకోవాలని క్రీడాభిమానులు భావిస్తున్నారు. 

click me!