IPL 2021 MIvsCSK: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్... రోహిత్ శర్మ లేకుండానే...

First Published Sep 19, 2021, 7:06 PM IST

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ఆరంభమ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఈ మ్యాచ్‌కి కిరన్ పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడిన తర్వాత 140 రోజులకు తిరిగి, లీగ్ ప్రారంభమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే రెండు మ్యాచ్‌లకు ఇంత భారీ గ్యాప్ రావడం ఇదే తొలిసారి...

ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. సీఎస్‌కే తరుపున అంబటి రాయుడు, ముంబై ఇండియన్స్ తరుపున కిరన్ పోలార్డ్ సిక్సర్ల మోత మోగించారు...

ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుని, చప్పగా సాగుతున్న ఐపీఎల్‌ ఫస్టాఫ్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది ముంబై ఇండియన్స్...

యూఏఈలో డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో ముంబై ఇండియన్స్ బరిలో దిగుతుంటే, గత ఏడాది సీఎస్‌కే దారుణమైన ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలవడంతో చెన్నై సెకండాఫ్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగాగా మారింది...

జస్ప్రిత్ బుమ్రాకి ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. ముంబై ఇండియన్స్ తరుపున 100 మ్యాచులు ఆడిన ఆరో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు బుమ్రా..

ఇంతకుముందు హర్భజన్ సింగ్, అంబటి రాయుడు, లసిత్ మలింగ, కిరన్ పోలార్డ్, రోహిత్ శర్మ... ముంబై ఇండియన్స్ తరుపున 100కి పైగా మ్యాచులు ఆడారు... 

ఈ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ తరుపున యంగ్ బ్యాట్స్‌మెన్ అన్‌మోల్ సింగ్ ఆరంగ్రేటం చేస్తున్నాడు. రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతని స్థానంలో పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టు ఇది: డి కాక్, అన్‌మోల్‌ ప్రీత్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరబ్ తివారి, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహార్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది: డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ ఆలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, జోష్ హజల్‌వుడ్, రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, డ్వేన్ బ్రావో

click me!