IPL Auction 2021: హాట్ ఫెవరెట్‌గా డేవిడ్ మలాన్... కేరళ యంగ్‌స్టార్ అజారుద్దీన్ కోసం...

First Published Feb 18, 2021, 10:10 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎంత మంది క్రికెటర్లు పాల్గొంటున్నా, కొందరు ప్లేయర్లపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. మొత్తం 292 మంది పాల్గొంటున్నప్పటికీ ఇందులో 8 ఫ్రాంఛైజీలు కలిపి కేవలం 61 మందిని మాత్రమే తీసుకోబోతున్నాయి. వీరిలో కొందరు స్టార్ క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టబోతుంటే, మరికొందరు యంగ్‌స్టర్లు, వేలంలో స్టార్‌లుగా మారబోతున్నారు. ఐసీసీ టీ20 టాప్ ర్యాంకర్ డేవిడ్ మలాన్, మినీ వేలంలో హాట్ ఫెవరెట్‌గా మారాడు.

డేవిడ్ మలాన్: గత కొద్ది కాలంగా టీ20 ఫార్మాట్‌లో రికార్డు లెవెల్లో పరుగులవరద పారిస్తున్నాడు డేవిడ్ మలాన్. ఈ ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌‌మెన్ కోసం ఐపీఎల్ మినీ వేలంలో జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. బిగ్‌బాష్ లీగ్‌తో పాటు ఫారిన్ లీగుల్లో దుమ్మురేపుతున్న మలాన్ కోసం ఏ జట్లు, ఎన్ని కోట్లు గుమ్మరిస్తుందో చూడాలి...
undefined
గ్లెన్ మ్యాక్స్‌వెల్: ఐపీఎల్ 2020 సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. 13 మ్యాచుల్లో కలిపి కేవలం 108 పరుగులే చేసిన మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఇష్టపడుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
undefined
మొయిన్ ఆలీ: ఐపీఎల్ మినీ వేలానికి ముందు జరిగిన రెండో టెస్టులో హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ. గత సీజన్‌లో ఆర్‌సీబీకి ఆడిన మొయిన్ ఆలీని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది...
undefined
అలెక్స్ హేల్స్: బిగ్‌బాష్ లీగ్ సీజన్ 10లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు అలెక్స్ హేల్స్. ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ కోసం కూడా ఫ్రాంఛైజీల మధ్య మంచి రసవత్తరమైన పోటీ జరిగే అవకాశం ఉంది...
undefined
స్టీవ్ స్మిత్: గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు సారథిగా వ్యవహారించిన స్టీవ్ స్మిత్, బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యాడు. అయితే వన్డేల్లో కూడా టీ20 ఇన్నింగ్స్‌లు ఆడగలనని నిరూపించుకున్న స్మిత్‌కి ఈ వేలంలో మంచి ధర దక్కే అవకాశం ఎక్కువగానే కనిపిస్తోంది...
undefined
షకీబ్ అల్ హసన్: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, ఏడాది నిషేధం తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. గేమ్ ఛేంజర్‌గా గుర్తింపు దక్కించుకున్న షకీబ్ కోసం ఐపీఎల్ మినీ వేలం 2021లో మంచి పోటీ జరిగే అవకాశం ఉంది..
undefined
అజారుద్దీన్: సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 37 బంతుల్లోనే అద్భుత సెంచరీతో అదరగొట్టిన మహ్మద్ అజారుద్దీన్ కోసం ఐపీఎల్ జట్ల మధ్య మంచి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
undefined
హర్భజన్ సింగ్: భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లలో ఒకడు. మ్యాచ్ విన్నర్ పర్ఫామెన్స్ ఇవ్వగల భజ్జీని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
undefined
అర్జున్ టెండూల్కర్: సచిన్ టెండూల్కర్ వారసుడైన అర్జున్ టెండూల్కర్, ఈ ఏడాది ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయింది. అర్జున్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టు ముందుకొచ్చినా, రాకపోయినా అతను ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లడం లాంఛనమే.
undefined
కేదార్ జాదవ్: గత సీజన్‌లో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న ప్లేయర్లలో కేదార్ జాదవ్ ఒకడు. రూ.7 కోట్లు 80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసిన జాదవ్‌ను, మినీ వేలానికి వదిలేసింది సీఎస్‌కే. అయితే రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ కలిగిన కేదార్ జాదవ్‌ను కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్‌ తప్ప మరో జట్టు సాహసం చేయకపోవచ్చు.
undefined
click me!