IPL 2021 MI vs DC: ఐపీఎల్ 14 సీజన్ లో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే ముంబై ఇండియన్స్ కు నేటి పోరు కీలకం కానున్నది. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లో తప్పక నెగ్గాలి. మరోవైపు జోరు కొనసాగించాలని ఢిల్లీ భావిస్తున్నది.
ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో అత్యంత రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫిని సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సారి పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.
213
ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆ జట్టు ఇకమీదట ఆడే మూడు మ్యాచ్ లను గెలవాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ జోరు కొనసాగించాలని చూస్తున్నది. ఈ మ్యాచ్ గెలిచి చెన్నైతో సమానంగా నిలువాలని ఆ జట్టు భావిస్తున్నది.
313
ఇప్పటివరకు 11 మ్యాచుల్లో 8 గెలిచి 16 పాయింట్లతో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా.. 11 మ్యాచుల్లో ఐదు మాత్రమే గెలిచి 10 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో ఉంది.
413
షార్జా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే 46 వ మ్యాచ్ ముంబైకి కీలకం. అందుకే ఈ పోరులో ముంబై జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది.
513
కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ డికాక్ రాణిస్తున్నా మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టును తీవ్రంగా వేధిస్తున్నది. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ లు బ్యాటింగ్ లో విఫలమవుతుండగం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది.
613
అద్భుత ప్రదర్శనతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకున్న యాదవ్.. సెకండ్ ఫేజ్ లో ఆడిన నాలుగు మ్యాచుల్లో చేసిన స్కోర్లు 0, 8, 5, 3. ఇది ముంబై జట్టును ఆందోళనకు గురి చేస్తున్నది.
713
Mumbai Indians
మరోవైపు ఇషాన్ కిషన్ కూడా వరుస మ్యాచుల్లో విఫలమవుతున్నాడు. ఈ ఇద్దర్నీ నేటి కీలక పోరుకు పక్కనబెట్టాలని ముంబై భావిస్తున్నది.
813
బౌలింగ్ లో బుమ్రా స్థిరంగా రాణిస్తున్నాడు. పొలార్డ్, బౌల్ట్ కూడా ఉపయుక్తకరమైన బౌలింగ్ తో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నా చివరి ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు అప్పజెప్పుతున్నారు.
913
ఇక ఢిల్లీ విషయానికొస్తే.. ఈ సీజన్ లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఆ జట్టు జోరు కొనసాగించాలని చూస్తున్నది. బ్యాట్ తో ధావన్, పంత్, అయ్యర్ అదరగొడుతున్నారు. పృథ్వీ షా కూడా మెరుగ్గా ఆడితే ఆ జట్టు భారీ స్కోరు సాధించడం పెద్ద విషయమేమీ కాదు.
1013
బౌలింగ్ లో కగిసొ రబడ, నార్త్జ్, మార్కస్ స్టోయినిస్ తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. స్పిన్ లో కూడా అశ్విన్, అక్షర్, లలిత్ యాదవ్ ఫర్వాలేదనిపిస్తుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం.
1113
ఐపీఎల్ లో ఇప్పటివరకు ఈ రెండు జట్టు 29 సార్లు పోటీ పడగా.. ముంబై 16 సార్లు, ఢిల్లీ 13 సార్లు నెగ్గాయి.
1213
జట్లు అంచనా:
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్/ ఇషాన్ కిషాన్, హర్ధిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, సౌరభ్ తివారీ, నాథన్ కౌల్టర్ నైల్/జయంత్ యాదవ్, రాహుల్ చహార్, బౌల్ట్, బుమ్రా