అప్పుడు గౌతమ్ గంభీర్, ఇప్పుడు ఇయాన్ మోర్గాన్... ఆ లెక్కన ఈసారి కేకేఆర్ టైటిల్ గెలవనుందా?

First Published | Sep 28, 2021, 7:47 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో చాలా మ్యాచులు వన్‌సైడెడ్‌గా సాగినా, సెకండాఫ్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న సీఎస్‌కే, ఢిల్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ విజయావకాశాలు ఎక్కువగా ఉండగా... మిగిలిన ఒక్క ప్లేస్ కోసం నాలుగు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది...

ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోటీ సాగుతుండగా నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌‌కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...

అయితే ఓ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే, ఈసారి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలవనుందని అంటున్నారు కేకేఆర్ ఫ్యాన్స్...


2014 సీజన్‌లో టైటిల్ అందించిన అప్పటి కెప్టెన్ గౌతమ్ గంభీర్, మూడుసార్లు డకౌట్ అయ్యాడు. 2021 సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా మూడుసార్లు డకౌట్ అయ్యాడు...

అలాగే 2014 సీజన్‌లో మొదటి మ్యాచ్ గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడిన కేకేఆర్... ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది... 

ఈ సీజన్‌లో కూడా మొదటి మ్యాచ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఈజీ విక్టరీ సాధించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది...

అదీకాక 2014 సీజన్‌లో గ్రూప్ స్టేజ్‌లో మొదటి 10 మ్యాచులు ముగిసే సమయానికి సీఎస్‌కే పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా, ఈసారి కూడా 10 మ్యాచులు ముగిసేసమయానికి చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో టాప్‌లో నిలిచింది... 

ఈ రెండు సెంటిమెంట్ల ప్రకారం చూసుకుంటే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించి... మూడో టైటిల్ గెలవబోతుందని అంచనా వేస్తున్నారు కేకేఆర్ ఫ్యాన్స్...

Latest Videos

click me!