KKR vs DC: రిషబ్ పంత్ అరుదైన ఘనత.. సెహ్వాగ్, ధోని లకే సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్న ఢిల్లీ కెప్టెన్

First Published Sep 28, 2021, 6:16 PM IST

IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ (rishabh pant) అరుదైన ఘనతను  సొంతం చేసుకున్నాడు. భారత క్రికెట్ లో ఏ వికెట్ కీపర్ కు సొంత కాని రికార్డును పంత్ సాధించాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంత్ ఈ ఫీట్ నెలకొల్పాడు. 

భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. కోల్కతా (kolkata knight riders) తో జరుగుతున్న మ్యాచ్ లో  ఒకవైపు వికెట్లు పడుతున్నా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన పంత్.. టీ 20లలో అత్యంత వేగంగా 3 వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. 

ఈ ఘనత సాధించిన తొలి భారత వికెట్ కీపర్ గా పంత్ చరిత్ర సృష్టించాడు. 108 ఇన్నింగ్స్ లోనే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఈ ఘనత సాధించాడు. 

ఓవరాల్ గా టీ 20 (భారత జట్టు తరఫున) లలో వేగంగా 3 వేల పరుగులు చేసిన వారిలో పంత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 

Rishabh Pant

పంత్ కంటే ముందు  కెఎల్ రాహుల్ (93 ఇన్నింగ్స్), సురేశ్ రైనా, గౌతం గంభీర్ (107 ఇన్నింగ్స్) లో ఈ మైలురాయిని చేరుకున్నారు. 

ఈ రికార్డే గాక కోల్కతా మ్యాచ్ లో మరో రికార్డు  నెలకొల్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. 

ఢిల్లీ తరఫున పంత్ 2,385 పరుగులు చేయగా.. తర్వాత జాబితాలో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (2,382), శ్రేయస్ (2,291), ధావన్ (1,933) ఉన్నారు. 

ఈ సీజన్ లో  ఢిల్లీ  నాయకుడిగా వ్యవహరిస్తున్న  పంత్.. ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడి 311 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 58 కాగా స్ట్రైక్ రేట్ 127.98 గా ఉంది. 

click me!