మీకు దండం పెడతా, ముందు ఆ కెప్టెన్‌ని మార్చేయండి... కేకేఆర్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్...

First Published Oct 3, 2021, 3:48 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు, సెకండాఫ్‌లో అదిరిపోయే ఆటతీరు చూపించింది. వరుస విజయాలతో టాప్ 4లోకి దూసుకొచ్చింది... ఓపెనింగ్ జోడీలో చేసిన మార్పులు కేకేఆర్‌కి బాగా కలిసొచ్చాయి...

ఫస్టాఫ్‌లో నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్‌లతో ఓపెనింగ్ చేయించిన కేకేఆర్, సెకండాఫ్‌లో రాణాను మిడిల్ ఆర్డర్‌లో దింపుతూ, వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా మారుస్తూ వేసిన ఎత్తుగడ సూపర్ సక్సెస్ అయ్యింది...

సెకండాఫ్‌లో ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్, బ్యాటింగ్‌లో అదరగొడుతూ బౌలింగ్‌లోనూ మంచి పర్ఫామెన్స్‌తో ఫ్యూచర్ ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్నాడు...

అయితే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ను విపరీతంగా వెంటాడుతున్న సమస్య కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫామ్... ఫస్టాఫ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులు చేసిన మోర్గాన్, ఆ ఇన్నింగ్స్ తప్ప చెప్పకోదగ్గ మరో ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన ఇయాన్ మోర్గాన్, కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సగటు 10.90 మాత్రమే కాగా, స్ట్రైయిక్ రేటు కూడా 100కి కాస్త అటూ ఇటూగా ఉంది...

సెకండాఫ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులు చేసిన మోర్గాన్, సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగులు చేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన మోర్గాన్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులే చేయగలిగాడు...

‘కేకేఆర్, మీకు చేతులెత్తి దండం పెడతా... ముందు కెప్టెన్‌ని మార్చేయండి. ఇంతకముందు కూడా బాగా ఆడకపోతే కెప్టెన్లని మార్చేశారు, కాబట్టి ఈసారి ఆ పని చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

ఐపీఎల్ 2020 సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న దినేశ్ కార్తీక్, సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కార్తీక్ స్థానంలో 2019 వన్డే వరల్డ్‌కప్ విన్నర్ మోర్గాన్‌కి కెప్టెన్సీ దక్కింది...

అయితే ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో కేకేఆర్ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది. 2020 సీజన్‌లో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకున్న కేకేఆర్, ఆ తర్వాత మోర్గాన్ కెప్టెన్సీలో ఏడు మ్యాచుల్లో మూడింట్లో గెలిచి నాలుగింట్లో ఓడింది...

click me!