MS DHONI: రిటైర్మెంట్ తర్వాత ధోని చూపు బాలీవుడ్ వైపేనా..? సినిమాలపై తన నిర్ణయం చెప్పేసిన మిస్టర్ కూల్..

Published : Oct 06, 2021, 08:08 PM ISTUpdated : Oct 06, 2021, 08:09 PM IST

IPL 2021: భారత క్రికెట్ కు వన్డే, టీ20 ప్రపంచకప్ లతో పాటు టెస్టు ఛాంపియన్షిప్ కూడా అందించిన మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని.. ఐపీఎల్ లో వచ్చే  ఏడాది కూడా ఆడతానని ప్రకటించాడు. అయితే ఆ తర్వాత ఈ మిస్టర్ కూల్ చూపు Bollywood వైపునకు పడుతుందా..? 

PREV
18
MS DHONI: రిటైర్మెంట్ తర్వాత ధోని చూపు బాలీవుడ్ వైపేనా..? సినిమాలపై తన నిర్ణయం చెప్పేసిన మిస్టర్ కూల్..

గతేడాది IPL సీజన్ లో దారుణంగా ఓడిన Chennai Super Kingsను ఈసారి ఎలాగైనా టోర్నీ విజేతగా నిలపాలని కంకణం కట్టుకున్న సీఎస్కే  సారథి Mahendra Singh Dhoni.. ఐపీఎల్ నుంచి రిటైరైన తర్వాత ఏం చేయబోతున్నాడు.  

28

ఇప్పటికే భారత జట్టు నుంచి రిటైరైన ఈ జార్ఖండ్ డైనమైట్.. త్వరలో జరుగబోయే T20 WorldCup కోసం భారత జట్టుకు మెంటార్ గాను నియమితుడయ్యాడు. 

38

అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ లో తాను ఆడుతానని, చెన్నై చెపాక్ స్టేడియంలో తనకు వీడ్కోలు కావాలని ఆశిస్తున్నట్టు ధోని నిన్ననే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

48

మరి తర్వాతి ఐపీఎల్ తర్వాత ధోని  అడుగులు బాలీవుడ్ వైపునకు పడుతున్నాయా..? ఇప్పటికే పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న అతడు.. త్వరలోనే  వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నాడని పుకార్లు వినిపించాయి. ఈ విషయంపై మిస్టర్ కూల్ క్లారిటీ ఇచ్చేశాడు. 

58
MS Dhoni

ఇటీవల తనను కలిసిన మీడియా ప్రతినిధులు ధోనికి ఇదే ప్రశ్న వేశారు.  యాడ్ సంస్థలు తనతో యాడ్స్ చేసినన్నాళ్లు చేస్తానని చెప్పాడు. దాంట్లో తనకేమీ ఇబ్బందుల్లేవని స్పష్టం చేశాడు. 

68
এমএস ধোনি

మరి సినిమాల విషయానికొస్తే.. ‘నా దృష్టిలో నటన అనేది చాలా కష్టమైన విషయం. నటించడానికి మనకు చాలా మంది స్టార్స్ ఉన్నారు. వాళ్లు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఏదో యాడ్స్ లో వాళ్లు చెప్పింది చేస్తున్నా తప్ప నాకు దానిమీద ఆసక్తి లేదు’ అని తేల్చేశాడు. 

78

ధోని, అతడి భార్య సాక్షి పేరిట MSD Entertainment అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థ త్వరలోనే ‘captain 7’ అని ఒక యానిమేషన్ సినిమాను  రూపొందిస్తున్నది. 

88

మిస్టర్ కూల్ జీవితకథపై ఇప్పటికే బాలీవుడ్ లో  దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన M.S.Dhoni: The Untold Story సినిమా వచ్చి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories