నా బ్యాటింగ్ చూసి, అప్పుడప్పుడూ నేనే షాక్ అవుతూ ఉంటా... ఏబీ డివిల్లియర్స్ కామెంట్...

First Published Apr 20, 2021, 6:22 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్‌సీబీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, ఆపద్భాంధవుడిలా ఆదుకునే ఏబీ డివిల్లియర్స్, ఈ సీజన్‌లో కూడా తన రోల్‌ను పర్ఫెక్ట్‌గా పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్న ఏబీడీ, కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు...

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కి వచ్చిన ఏబీ డివిల్లియర్స్, 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి, జట్టుకి విజయాన్ని అందించాడు...
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్, కేకేఆర్ బౌలర్లను చితక్కొట్టి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు...
undefined
‘నాకు బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ ఎంతో మజాగా ఉంటుంది. కొన్నిసార్లు నా పర్ఫామెన్స్ చూసి, నేనే ఆశ్చర్యపోతూ ఉంటా. ఇంత బాగా ఆడింది, నేనేనా అని అనుకుంటూ ఉంటా...
undefined
క్రీజులోకి బ్యాట్స్‌మెన్‌గా అడుగుపెట్టినప్పుడు, అవుట్ అయ్యేవరకూ బెస్ట్ ఇవ్వడమే నా పని... మరీ ముఖ్యంగా నా ఆటను నేను ఎంతగానో ఎంజాయ్ చేస్తా...
undefined
క్రికెట్ ఆడడం ఎంత ఇష్టమే, ఆర్‌సీబీకి ఆడడం కూడా అంతే ఇష్టం... మ్యాక్స్‌వెల్ రాణించడం వల్ల, నా పని మరింత తేలికవుతోంది.
undefined
మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీలతో బ్యాటింగ్ చేయడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఏబీ డివిల్లియర్స్...
undefined
‘రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడో వచ్చింది. ఆ అవకాశం దక్కితే, నేనెప్పుడూ సిద్ధమే. సౌతాఫ్రికా జట్టుకి ఆడాలనే కోరిక ఇంకా తీరలేదు...
undefined
ప్రస్తుతానికి నా ఫామ్‌తో ఫిట్‌నెస్ కూడా బాగుంది. జట్టుకి అవసరమైన పరుగులు చేయగలుగుతున్నా. ప్రస్తుతానికి ఐపీఎల్ గురించే ఆలోచిస్తున్నా. ఇది ముగిసిన తర్వాత సౌతాఫ్రికా జట్టుతో మాట్లాడతా’ అంటూ చెప్పుకొచ్చాడు ఏబీ డివిల్లియర్స్...
undefined
2018లో ఏబీ డివిల్లియర్స్, అంతర్జాతీయ క్రికెట్‌కి అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌతాఫ్రికా జట్టు ప్రదర్శన రోజురోజుకీ దిగజారుతోంది.2019 వన్డే వరల్డ్‌కప్‌లో చిన్న చిన్న జట్లతో ఓడిన సఫారీలు, ఫ్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయారు.
undefined
2021 టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న సందర్భంగా, ఐపీఎల్‌లో భారత పిచ్‌లపై అద్భుతంగా రాణించే ఏబీ డివిల్లియర్స్‌ను మళ్లీ జట్టులోకి తీసుకొస్తే, మంచి పర్ఫామెన్స్ ఇవ్వొచ్చని భావిస్తోంది సౌతాఫ్రికా క్రికెట్ జట్టు.
undefined
click me!