ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి గుడ్‌న్యూస్... గాయం నుంచి కోలుకున్న సీనియర్ పేసర్...

First Published Apr 20, 2021, 5:12 PM IST

IPL 2021 సీజన్‌లో కూడా ఫ్రాంచైజీలను గాయాల బెడద వేధిస్తూనే ఉంది. క్లాస్ ప్లేయర్ కేన్ విలియంసన్ గాయపడి, మూడు మ్యాచుల్లో బరిలో దిగకపోవడంతో భారీగా ఇబ్బందిపడుతోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కి మాత్రం ఈ విషయంలో కాస్త ఊరట లభించింది...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే గాయపడిన భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పూర్తిగా కోలుకుని, ఫిట్‌నెస్ సాధించాడు... దీంతో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను బరిలో దిగే అవకాశం ఎక్కువగా ఉంది...
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఆడిన ఇషాంత్ శర్మ, ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడు. ఇషాంత్ శర్మ మడమల్లో గాయం కావడంతో మొదటి మూడు మ్యాచుల్లో అతను బరిలో దిగలేదు...
undefined
ఇషాంత్ శర్మకు గాయం కావడంతో అతని స్థానంలో బరిలో దిగిన ఆవేశ్ ఖాన్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు. ఇషాంత్ శర్మ గాయం కోలుకోవడంతో ఆవేశ్ ఖాన్‌ను కొనసాగిస్తారా? లేక అతన్ని పక్కనబెడతారా? చూడాలి...
undefined
సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. అలాగే క్రిస్‌వోక్స్ కూడా భారీగా పరుగులు సమర్పించాడు.
undefined
కరోనా నుంచి కోలుకున్న మరో స్టార్ పేసర్ నోకియా నేటి మ్యాచ్‌లో బరిలో దిగే అవకాశం ఉంది. దీంతో నోకియా, రబాడా, ఇషాంత్ శర్మ, ఆవేశ్ ఖాన్‌లతో ఢిల్లీ పేస్ బౌలింగ్ విభాగం పటిష్టం కానుంది.
undefined
గత మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న లుక్మన్ మెరివాలా, మొదటి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో మెరివాలా స్థానంలో ఇషాంత్ శర్మను దించి, ఆవేశ్ ఖాన్‌ను కొనసాగించే అవకాశం కూడా ఉంది...
undefined
వరుసగా రెండు మ్యాచుల్లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ విజయం సాధించిన ముంబై ఇండియన్స్, ఈ మ్యాచ్‌లో భారీ టార్గెట్ నిర్దేశించే ఉద్దేశంతో బరిలో దిగడం పక్కా...
undefined
శిఖర్ ధావన్, పృథ్వీషా, రిషబ్ పంత్, స్టోయినిస్, స్టీవ్ స్మిత్ - రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, ఇషాన్ కిషన్... ఇలా బ్యాట్స్‌మెన్ మధ్య హోరాహోరీ పోరు కంటే బౌలర్ల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ సాగే అవకాశం ఉంది.
undefined
click me!