వయసైపోతోంది, అప్పటిలా ఆడలేను, నా వల్ల జట్టుకే నష్టం... మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ కామెంట్...

First Published Apr 20, 2021, 5:47 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... ఏ మ్యాచ్‌లో అయినా, లక్ష్యం ఎంత పెద్దదైనా క్రీజులో మాహీ ఉన్నాడంటే అదో భరోసా... ఎలాగోలా మ్యాచ్‌ను గెలిపిస్తాడనే నమ్మకం. కానీ ధోనీ ఆటతీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మాహీ ముఖంలో కానీ, ఆటలో కానీ మునుపటి జోరు, ఉత్సాహం కనిపించడం లేదు... 

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో రెండో బంతికి డకౌట్ అయిన మహేంద్ర సింగ్ ధోనీ, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేశాడు...
undefined
మాహీ క్రీజులో వచ్చే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మంచి స్కోరుతో పటిష్టంగా ఉంది. అలాంటి సమయంలో ధోనీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాడని, భారీ షాట్లు చూసే అదృష్టం దక్కుతుందని భావించారంతా...
undefined
మాహీ స్పెషల్ హెలికాఫ్టర్ షాట్స్ చూడాలని, ఆశపడ్డారు చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు... మాహీ మాత్రం ఖాతా తెరవడానికే ఆరు బంతులను వాడుకున్నాడు.
undefined
ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండానే పెవిలియన్ చేరిన మాహీ మరోసారి తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. మొదటి మ్యాచ్‌లో యంగ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన ధోనీ, రాజస్థాన్‌తో మ్యాచ్‌లో యంగ్ బౌలర్ సకారియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
undefined
‘నా వయసు పెరిగింది. 24 ఏళ్ల వయసులో ఆడినట్టుగా, నా 40 ఏళ్ల వయసులో ఆడలేకపోతున్నాడు. నేను మొదటి పరుగు చేయడానికే ఆరు బంతులు తీసుకోవాల్సి వచ్చింది...
undefined
ఇలా నెమ్మదిగా ఆడడం వల్ల చెన్నై సూపర్ కింగ్స్‌కి నష్టం కలుగుతోంది. దీన్ని నేను కూడా అంగీకరిస్తున్నా... అయితే నేను ఈ మ్యాచ్‌లో వృథా చేసిన ఆరు బంతులు, వేరే మ్యాచ్‌లో ఉపయోగపడతాయని కచ్ఛితంగా చెప్పగలను...
undefined
మనం కరెక్టుగా పర్ఫామ్ చేస్తే, ఎలాంటి ట్రోల్స్ రావు. కానీ ఈ వయసులో ప్రతీ మ్యాచ్‌లో పర్ఫామెన్స్ ఇవ్వాలంటే కూడా కష్టమే... ఫిట్‌గా ఉండడానికి నేనెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటా...
undefined
నా జట్టులో ఉన్న ప్రతీ యువ ప్లేయర్‌తో నేను పోటీపడుతూనే ఉంటా. ఫిట్‌నెస్ విషయంలో నన్ను ట్రోల్ చేయలేరు... నా పూర్తి ఫోకస్ మొత్తం గేమ్‌పైనే ఉంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌గా 200వ మ్యాచ్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, సీఎస్‌కేకి మూడు టైటిల్స్ అందించాడు. 10 సీజన్లలో ప్రతీసారి ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టు సీఎస్‌కే...
undefined
అయితే గత సీజన్‌లో స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లేకపోవడంతో వరుస మ్యాచుల్లో ఓడి, ఫ్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది సీఎస్‌కే...
undefined
click me!