IPL 2021: అంపైర్లతో విరాట్ కోహ్లీ గొడవ... వికెట్ల ముందు పడుతున్నా కనిపించడం లేదా అంటూ...

First Published Oct 11, 2021, 10:36 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌‌లో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ ఫీల్డ్ అంపైర్లు ఇచ్చిన మూడు నిర్ణయాలు, డీఆర్‌ఎస్‌లో తప్పుగా తేలాయి...

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసినా అనుకున్నంత స్కోరు చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విరాట్ కోహ్లీ, అంపైర్ల తప్పుడు నిర్ణయాలతో మరింత అసహనానికి లోనయ్యాడు.

ఆర్‌సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షాబజ్ అహ్మద్‌ని ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడం, ఆ తర్వాత హర్షల్ పటేల్‌ను అవుట్‌గా ప్రకటించడంతో ఆ బంతుల్లో వాళ్లు తీసిన రెండు పరుగులను కోల్పోవాల్సి వచ్చింది...

యజ్వేంద్ర చాహాల్ వేసిన ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి రాహుల్ త్రిపాఠి, షాట్ మిస్ కావడంతో నేరుగా వెళ్లి అతని కాళ్లకు బంతి తగిలింది. 

వెంటనే బౌలర్‌తో పాటు ఆర్‌సీబీ ఫీల్డర్లు అందరూ ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేశారు. అయితే అంపైర్ వీరేందర్ శర్మ నాటౌట్‌గా ప్రకటించాడు...

దీంతో బౌలర్‌తో చర్చించిన విరాట్ కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది...

థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో విరాట్ కోహ్లీ, అంపైర్ వీరేందర్ శర్మ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు... ‘కాళ్ల దగ్గర వికెట్ల ముందు పడుతున్నా కనిపించడం లేదా...’ అంటూ ప్రశ్నించాడు...

ఒకటి, కాదు రెండు కాదు... మూడు సార్లు తప్పుడు నిర్ణయాలు ఎలా ఇస్తారంటూ వారితో కాసేపు వాదించాడు విరాట్ కోహ్లీ...

ఈ సంఘటన కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫేర్‌ప్లే పాయింట్లను మరిన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి అంపైర్లతో వాదించినందుకు విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించే అవకాశం కూడా ఉంది...

అయితే ఎలిమినేటర్ వంటి కీలక మ్యాచ్‌లో ఏకంగా మూడు తప్పుడు నిర్ణయాలు ప్రకటించినప్పుడు అగ్రెసివ్ కెప్టెన్ విరాట్‌కి కోపం రావడంలో తప్పు లేదంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్..

click me!