మిగిలిన వాటికి ఛాన్స్ లేదు, ఆ నాలుగు జట్లే ప్లేఆఫ్స్ చేరతాయి... గౌతమ్ గంభీర్ కామెంట్...

First Published Sep 19, 2021, 7:36 PM IST

140 రోజుల తర్వాత మళ్లీ ఐపీఎల్ 2021 సందడి తిరిగి మొదలైంది. దీంతో ఈసారి ప్లేఆఫ్ చేరేదెవరు, ఫైనల్ చేరేదెవరు? విజేతగా నిలిచేదెవరు వంటి ప్రిడిక్షన్స్ జోరుగా సాగుతున్నాయి. కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్, 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరే నాలుగు జట్ల గురించి చెప్పుకొచ్చాడు...

‘నా అంచనా ప్రకారం ప్రస్తుతం టేబుల్‌లో టాప్ 4లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కి నేరుగా అర్హత సాధిస్తారు...

మిగిలిన టీమ్స్‌, వరుస విజయాలతో టాప్‌లోకి రావడం జరగకపోవచ్చని అనుకుంటున్నా. టాప్ 4లో ప్లేస్‌లు మారొచ్చు, కానీ వీళ్లే ఫ్లేఆఫ్ చేరేందుకు ఫెవరెట్ టీమ్స్...

పంజాబ్ కింగ్స్‌కి కూడా ఛాన్స్ ఉంది. ప్లేఆఫ్ చేరేందుకు ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కంటే పంజాబ్ కింగ్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తోంది...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో సత్తా ఉన్న ప్లేయర్లు ఉన్నారు. కానీ పంజాబ్ కింగ్స్‌ ఆడిన మ్యాచులు చూస్తుంటే, వాళ్లు ఫ్లేఆఫ్ చేరేందుకు అవకాశాలున్నాయని అనిపిస్తోంది... 

ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి వారికి ఫైనల్ చేరేందుకు, మరోసారి టైటిల్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముంబై కాకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరుతుందని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్..

గత సీజన్‌లో గౌతమ్ గంభీర్ చేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. గంభీర్ ఏ ప్లేయర్ బాగా ఆడతాడని అంచనా వేస్తే, అతను ఆ మ్యాచ్‌లో ఘోరంగా ఫెయిల్ అవ్వడం ఆనావాయితీగా వచ్చింది...

click me!