IPL 2021: మోర్గాన్, నీ కంటే ఎమ్మెస్ ధోనీ బాగా ఆడుతున్నాడు... గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు...

First Published Oct 15, 2021, 8:05 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇద్దరూ బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మోర్గాన్ 129 పరుగులు చేస్తే, ధోనీ కేవలం 114 పరుగులు చేసి ఈ సీజన్‌లో అతి తక్కువ పరుగులు చేసిన కెప్టెన్‌గా ఉన్నాడు...

మహేంద్ర సింగ్ ధోనీ 10 ఇన్నింగ్స్‌ల్లో 114 పరుగులు చేస్తే, ఇయాన్ మోర్గాన్ ఈ సీజన్‌లో నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. 10 సార్లు సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయాడు...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించిన ఎమ్మెస్ ధోనీ, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్‌లో 6 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసి విజయాన్ని అందించాడు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, కేకేఆర్‌కి విజయాన్ని అందించాడు ఇయాన్ మోర్గాన్. అయితే ఆ తర్వాత, అంతకుముందు అతని నుంచి అలాంటి పర్ఫామెన్స్ రాలేదు...

‘మోర్గాన్ ఈ సీజన్‌ ఆరంభంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానంలో వచ్చాడు. ఎందుకంటే ఫామ్‌లో లేకపోవడంతో అతను ఆ స్థానాన్ని ఎంచుకున్నాడు. అయితే సీజన్‌లో మ్యాచులు గడిచే కొద్దీ, మోర్గాన్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత కిందకి జారుతోంది...

పరుగులు రానప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి వెళ్తే, నీపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఫైనల్ ఆడుతున్న ఇద్దరు కెప్టెన్లను పోల్చి చూస్తే... ఎమ్మెస్ ధోనీ చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు...

దేశవాళీ క్రికెట్ కూడా ఆడడం లేదు. మోర్గాన్ మాత్రం రెగ్యూలర్ క్రికెట్ ఆడుతూ, ఇంగ్లాండ్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్‌లో చూస్తే మాత్రం మోర్గాన్ కంటే ఎమ్మెస్ ధోనీ బాగా ఆడుతున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

ఐపీఎల్ చరిత్రలో అత్యంత దారుణమైన సగటు నమోదుచేసిన కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన ఇయాన్ మోర్గాన్, ఫైనల్ మ్యాచ్‌లో వేగంగా పరుగులు చేసి ఆ చెత్త రికార్డును చెరిపేసుకుంటానని కామెంట్ చేశాడు కేకేఆర్ కెప్టెన్... 

click me!