IPL 2021: ఐసీసీ ట్రోఫీల్లోనే కాదు, టాస్ గెలవడంలోనూ నేనే కింగ్.. ఎమ్మెస్ ధోనీ మరో రికార్డు...

First Published Oct 10, 2021, 7:54 PM IST

IPL 2021 CSK vs DC: టీమిండియాకే కాదు, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఎమ్మెస్ ధోనీ ఒకడు. మహీ కెప్టెన్సీలో 10 సార్లు ప్లేఆఫ్స్ చేరిన సీఎస్‌కే, ఏడు సార్లు ఫైనల్ ఆడింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్... క్వాలిఫైయర్ 1లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడుతోంది సీఎస్‌కే జట్టు...

మొదటి క్వాలిఫైయర్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఎమ్మెస్ ధోనీ, సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో టాస్ గెలవడం ఇది 150వ సారి...

టీమిండియాకి 72 టీ20 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్‌లో 200+ మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు..

మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ఎమ్మెస్ ధోనీకి ఐపీఎల్ చరిత్రలో 25వ ప్లేఆఫ్స్ మ్యాచ్ కూడా... అత్యధిక ప్లేఆఫ్ మ్యాచులు ఆడిన ప్లేయర్ కూడా మాహీయే..

ఇంతకుముందు చెన్నై, ఢిల్లీ మధ్య రెండు సార్లు ప్లేఆఫ్ మ్యాచులు జరిగాయి. ఇంతకుముందు 2012లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై 86 పరుగుల తేడాతో విజయం అందుకున్న సీఎస్‌కే, 2019లో 6 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరితే, చరిత్రలో ఫైనల్ ఆడే అతి పెద్ద వయసున్న కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు 40 ఏళ్ల ధోనీ...

click me!