IPL 2020: యశస్వి జైస్వాల్... పానీపూరీ అమ్మిన కుర్రాడి విజయగాథ...
యశస్వి జైస్వాల్... భారత దేశవాళీ క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. తిరుగులేని రికార్డులతో నిలకడైన ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ 18 ఏళ్ల కుర్రాడి కోసం ఐపీఎల్ 2020 వేలంలో పోటీపడ్డాయి ఫ్రాంఛైసీలు. అండర్ 19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన ఈ కుర్రాడిని రూ.2 కోట్ల 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. బతుకుతెరువు కోసం పానీపూరీ అమ్మిన కుర్రాడు, నేడు క్రికెట్ కెరీర్ ఆరంభంలోనే కోట్ల రూపాయలు సొంతం చేసుకున్న యంగ్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్.