IPL 2020: అనిల్ కుంబ్లేకి బర్త్ డే విషెస్ చెప్పిన విరాట్ కోహ్లీ... అకౌంట్ హ్యాక్ అయ్యిందా...

First Published Oct 17, 2020, 10:07 PM IST

IPL 2020: భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే డెడికేషన్‌కి మారుపేరు. భారత జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహారించిన అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీతో మనస్పర్థల కారణంగా అర్ధాంతరంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కుంబ్లే వర్సెస్ కోహ్లీ ఫైట్‌పై అప్పట్లో చాలా పెద్ద చర్చే జరిగింది...

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్ చేతిలో చిత్తుగా ఓడింది టీమిండియా...
undefined
ఈ ఓటమికి కారణం కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య వచ్చిన మనస్పర్థలే అని వార్తలు వచ్చాయి...
undefined
అనిల్ కుంబ్లే కోచ్‌గా కొనసాగడం ఇష్టం లేకనే విరాట్ కోహ్లీ చెత్తాటతో మ్యాచ్ కావాలనే ఓడిపోయాడని కూడా వార్తలు వినిపించాయి...
undefined
కుంబ్లే శిక్షణలో 17 టెస్టు మ్యాచులు ఆడిన టీమిండియా, కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడింది...
undefined
ఏడాదిపాటు భారత జట్టుకు బౌలర్‌‌గా ఎన్నో విజయాలు అందించిన అనిల్ కుంబ్లే, టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు తీశాడు.
undefined
వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న అనిల్ కుంబ్లే, టెస్టు మ్యాచ్‌లో 10కి 10 వికెట్లు తీసిన ఏకైక బౌలర్...
undefined
అలాంటి కుంబ్లే, భారత జట్టుకి కోచ్‌గా నియమితం కావడంపై ఆనందం వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ...
undefined
అయితే కొన్నాళ్ల తర్వాత కోచ్‌కీ, కెప్టెన్‌కీ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి... ‘కుంబ్లే ఏం చెబితే, ప్లేయర్లు అందరూ దాన్ని కచ్ఛితంగా చేయాలని పట్టుబడతాడని, ఓ క్లాస్ లీడర్‌గా వ్యవహారిస్తారని’ వ్యాఖ్యానించాడు విరాట్.
undefined
అనిల్ కుంబ్లే కోచ్‌గా కొనసాగితే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ కచ్ఛితంగా చెప్పేశాడని వార్తలు వినిపించాయి...
undefined
అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మధ్య మనస్ఫర్థలు తొలగించడానికి బీసీసీఐ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఈ వివాదం సమయంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి ఉంటే, ఫలితం వేరేగా ఉండేదని, కుంబ్లేకి అవమానం జరిగనిచ్చేవాడు కాదని వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్.
undefined
ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి కోచ్‌గా కొనసాగుతున్నాడు అనిల్ కుంబ్లే. అయితే పంజాబ్ ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు...
undefined
అయితే విరాట్ టీమ్‌పై రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది పంజాబ్. దీంతో కోహ్లీపై కుంబ్లే పగ తీర్చుకున్నాడని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
undefined
కొన్నాళ్లుగా ఈ ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు. అలాంటి అనిల్ కుంబ్లే పుట్టినరోజున విరాట్ కోహ్లీ ట్విట్టర్ ద్వారా విష్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
కోహ్లీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని కొందరు అంటుంటే... అనిల్ కుంబ్లేతో గొడవలు ముగించడానికి విరాట్ ప్రయత్నిస్తున్నాడని మరికొందరు భావిస్తున్నారు.
undefined
click me!