IPL 2020: ధోనికి భయపడ్డ అంపైర్... ఫిక్సింగ్ అంటున్న ఫ్యాన్స్...

First Published Oct 14, 2020, 4:27 PM IST

IPL 2020 సీజన్‌లో వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన హాట్ టాపిక్ అయ్యింది..

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది...
undefined
సామ్ కుర్రాన్ 31, అంబటి రాయుడు 41, షేన్ వాట్సన్ 42 పరుగులు చేశారు...
undefined
ఆఖర్లో ధోనీ 21, రవీంద్ర జడేజా 25 పరుగులతో మెరవడంతో చెన్నైకి మంచి స్కోరు దక్కింది.
undefined
లక్ష్యచేధనలో వార్నర్, మనీశ్ పాండే, బెయిర్‌స్టో, ప్రియమ్ గార్గ్ వికెట్లను త్వరగా కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
undefined
అయితే కేన్ విలియంసన్ హాఫ్ సెంచరీతో ఒంటరిపోరాటం చేశాడు...
undefined
విలియంసన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ వస్తూనే ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టి సీఎస్‌కే గుండెల్లో గుబులు రేపాడు.
undefined
ఈ సమయంలోనే అంపైర్ చేసిన ఓ తప్పిదం వివాదాస్పదమైంది...
undefined
నదీమ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శార్దూల్ ఠాకూర్ వేసిన బంతి, లైన్‌కి దూరంగా వెళ్లింది...
undefined
దాన్ని వైడ్‌గా ప్రకటించాలని భావించిన అంపైర్, సిగ్నల్ ఇచ్చేందుకు చేతులు చాచబోయాడు..
undefined
అయితే అంపైర్ వైడ్ ఇవ్వబోతున్న విషయాన్ని గమనించిన ధోనీ, అతని వైపు కోపంగా చూశాడు.
undefined
అంతే అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని, చేతులను ఎత్తకుండా ఆపేశాడు...
undefined
పెవిలియన్ నుంచి దీన్ని గమనించిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ షాక్‌తో ఏం జరుగుతోందన్నట్టుగా అసహనాన్ని వ్యక్తం చేశాడు...
undefined
అంపైర్ ఓ ఆటగాడికి భయపడి, నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశమైంది..
undefined
లైన్ దాటి వెళ్తున్నట్టుగా క్లియర్‌గా కనిపించిన బంతిని వైడ్‌గా ఇవ్వకుండా ఎందుకు ఆపారు?
undefined
మ్యాచ్‌కి ముందే ధోనీ, సదరు అంపైర్ శ్రీనివాసన్‌తో ఢీల్ కుదుర్చుకొని ఉంటాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు...
undefined
ఆ బంతి వైడ్ ఇచ్చి ఉంటే, పరిస్థితి పూర్తిగా ఏం మారదు... 20 పరుగులతో ఓడిన సన్‌రైజర్స్, ఒక్క పరుగు తేడాను తగ్గించుకునేదంతే.. అని కొందరు సీఎస్‌కే సపోర్టర్లు కామెంట్ చేస్తున్నారు. ఆ బంతి వైడ్‌గా ఇచ్చి ఉంటే, అదే ఓవర్‌లో మరో బంతి వేయాల్సి వచ్చేది. ఆ బాల్ సిక్స్‌గా మారినా, బౌండరీ వచ్చినా, ఆఖరి ఓవర్లలో కొట్టాల్సిన పరుగులు 15 లేదా 16 వరకే ఉండేవి. అప్పుడు బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఉండదు. మ్యాచ్ ఫలితమే మారిపోయే అవకాశం ఉండేది.
undefined
అలాంటిది ధోనీ ఇలా ఛీటింగ్ చేయడం ఎందుకుని? విమర్శిస్తున్నారు సన్‌రైజర్స్ అభిమానులు...
undefined
ఇంతకుముందు గత సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పెవిలియన్ నుంచి క్రీజులోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు ధోనీ..
undefined
కూల్ కెప్టెన్‌గా పేరొందిన ధోనీ ఇలా చేయడం వల్లే అంపైర్ శ్రీనివాసన్, ఆ సంఘటనతో భయపడి ఇలా చేశాడని మరికొందరు అంటున్నారు.
undefined
click me!