వృద్ధిమాన్ సాహాను మెచ్చుకున్న కోచ్ రవిశాస్త్రి... మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం...
First Published | Oct 30, 2020, 5:29 PM ISTIPL 2020 సీజన్‌లో ఇప్పటిదాకా రెండే రెండు మ్యాచులు ఆడాడు వృద్ధిమాన్ సాహా. మొదటి మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో వచ్చి 26 బంతుల్లో ఒకే ఒక్క సిక్స్‌తో 25 పరుగులు చేయగా ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో 45 బంతుల్లో 87 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌పై టీమిండియా కోచ్ మెచ్చుకుంటూ వేసిన ఓ పోస్టు, మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది.