IPL 2020: సీజన్‌లో అదరగొట్టిన యంగ్ ప్లేయర్లు... సౌరవ్ గంగూలీ మెచ్చిన ఆరుగురు ఎవ్వరంటే...

First Published Nov 6, 2020, 3:28 PM IST

IPL 2020 సీజన్ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొని, వాయిదాలు పడి... ఎట్టకేలకు దుబాయ్ వేదికగా మొదలై విజయవంతంగా ముగింపు దశకు చేరుకుంది. అయితే ఎప్పుడూ లేనట్టు ఆఖరి గ్రూప్ మ్యాచ్ వరకూ ఉత్కంఠసాగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో యువకిషోరాలు అదరగొట్టారు. తమ ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుని, త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఉర్రూతలూగుతున్నారు. ఈ సీజన్‌లో తనకు బాగా నచ్చిన ఆరుగురు యువ ప్లేయర్ల గురించి చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ.

సూర్యకుమార్ యాదవ్... ఆరు సీజన్లుగా ఐపీఎల్‌ ఆడుతున్నాడు సూర్యకుమార్ యాదవ్. వరుసగా నాలుగు సీజన్లలో 400+ పరుగులు చేసిన మొట్టమొదటి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఈ ముంబై ప్లేయర్.
undefined
సూర్యకుమార్ యాదవ్‌ను ఆసీస్ టూర్‌కి ఎంపిక చేయకపోవడం చాలా పెద్ద చర్చకే దారితీసింది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘సూర్యకుమార్ యాదవ్ చాలా గొప్ప ప్లేయర్. అతనికి కూడా టైమ్ వస్తుంది... ’ అని చెప్పాడు.
undefined
2019 సీజన్‌లో 424 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 2018 సీజన్‌లో 512 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచులాడి 461 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
undefined
రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ఆటపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు సౌరవ్ గంగూలీ. ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన సంజూ శాంసన్, 375 పరుగులు చేశాడు. మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన సంజూ శాంసన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 85 పరుగులు.
undefined
రాహుల్ త్రిపాఠి... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులోకి లేటుగా ఎంట్రీ ఇచ్చినా, మంచి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు రాహుల్ త్రిపాఠి. 11 మ్యాచులు ఆడిన రాహుల్ త్రిపాఠి, 230 పరుగులు చేశాడు.
undefined
వరుణ్ చక్రవర్తి... ఈ సీజన్‌లో అదరగొట్టిన యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. 14 మ్యాచుల్లో 18 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. ఆసీస్ టూర్‌లో టీ20 జట్టుకి ఎంపికైన వరుణ్ చక్రవర్తినిప్రశంసల్లో ముంచెత్తాడు దాదా.
undefined
శుబ్‌మన్ గిల్... 21 ఏళ్ల యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 440 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికైన శుబ్‌మన్ గిల్‌ ఆటతీరును పొగడ్తల్లో ముంచేశాడు గంగూలీ.
undefined
దేవ్‌దత్ పడిక్కల్... మొదటి సీజన్‌లోనే అదరగొట్టాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్. ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన దేవ్‌దత్ పడిక్కల్, 5 హాఫ్ సెంచరీలతో 472 పరుగులు చేశాడు. ఈ ఆరుగురిని ప్రశంసించిన సౌరవ్ గంగూలీ... 2020 సీజన్‌లో అదరగొట్టిన మరికొందరు పేర్లను ప్రశంసించాడు.
undefined
రాహుల్ తెవాటియా... ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి మంచి ఫినిషర్‌గా మారాడు రాహుల్ తెవాటియా. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన రాహుల్ తెవాటియా... ఈ సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌లు ఆడి 255 పరుగులు చేశాడు. అంతేకాదు 10 వికెట్లు కూడా తీశాడు.
undefined
రవి బిష్ణోయ్... అండర్ 19 నుంచి ఐపీఎల్‌లో అదరగొట్టిన యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్. ఈ సీజన్‌లో 12 వికెట్లు తీసిన ఈ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్పిన్నర్, అందరి దృష్టినీ ఆకర్షించాడు.
undefined
నటరాజన్... ఓవర్‌లో ఆరుకి ఆరు యార్కర్లు వేసిన పేసర్ టి. నటరాజన్. 29 ఏళ్ల ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ 14 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు.
undefined
రుతురాజ్ గైక్వాడ్... చెన్నై సూపర్ కింగ్స్‌కి మేలిమి ఆణిముత్యం రుతురాజ్ గైక్వాడ్. కరోనా నుంచి కోలుకుని ఎంట్రీ ఇచ్చిన రుతురాజ్, మొదటి మూడు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ధోనీ ‘స్పార్క్’ కామెంట్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి వరుసగా మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేశాడు..
undefined
అర్ష్‌దీప్ సింగ్... పంజాబ్ తరుపున ఎంట్రీ ఇచ్చిన యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచులు ఆడిన అర్ష్‌దీప్ సింగ్, 9 వికెట్లు తీశాడు.
undefined
సందీప్ శర్మ...సన్‌రైజర్స్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎంట్రీ ఇచ్చాడు సందీప్ శర్మ. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు సందీప్ శర్మ. పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సందీప్ శర్మ, ఎనిమిది సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు.
undefined
ఈ సీజన్‌లో మెరిసిన మరో ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్. 13 మ్యాచులు ఆడని ఇషాన్ కిషన్, నాలుగు హాఫ్ సెంచరీలతో 483 పరుగులు చేశాడు.
undefined
click me!