Published : Oct 10, 2020, 04:13 PM ISTUpdated : Oct 10, 2020, 04:18 PM IST
IPL 2020 సీజన్‌లో షారుక్ ఫ్రాంఛైజీ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నిలకడగా ఆడుతోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 168 పరుగులు మాత్రమే చేసి, విజయం అందుకుంది. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో అన్యూహ్యంగా పుంజుకుని విక్టరీ కొట్టింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఈ మ్యాచ్‌కు షారుక్ ఖాన్, కుటుంబంతో సహా హాజరయ్యాడు.