రికార్డుల దుమ్ముదులిపిన ఐపీఎల్ 2020... ఏకంగా ఎంత వ్యూయర్‌షిప్ పెరిగిందంటే...

First Published Nov 22, 2020, 1:17 PM IST

లాక్‌డౌన్ పుణ్యమాని టీఆర్పీ రేటింగ్స్ రికార్డులన్నీ బద్ధలు అవుతున్నాయి. పెద్దగా కథ, కథనాలు లేని సినిమాలు కూడా రికార్డు స్థాయిలో టీఆర్పీ సాధిస్తూ, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అలాంటిది ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ టోర్నీ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికే మ్యాచులను చూసే అవకాశం కల్పిస్తూ హాట్ స్టార్ మెలిక పెట్టినా, టీవీల్లో మాత్రం పాత రికార్డుల దుమ్ము దులిపింది 13వ సీజన్ ఐపీఎల్...

ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించి, యూఈఏలో ఖాళీ స్టేడియాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌ను విజయవంతంగా నిర్వహించింది భారత క్రికెట్ బోర్డు...
undefined
ఖాళీ మైదానంలో, ఛీర్ గర్ల్స్ కూడా లేకుండా జరిగే ఈ సీజన్ హిట్ అవుతుందా? అనే అనుమానాలు లీగ్ ఆరంభానికి ముందు చాలామందికి కలిగాయి... కానీ ఎంట్రీతోనే ఐపీఎల్ 2020 అదరగొట్టింది.
undefined
లీగ్‌లో జరిగిన రెండో మ్యాచే సూపర్ ఓవర్‌కి దారి తీయడంతో పాటు చాలా మ్యాచులు ఉత్కంఠభరితంగా సాగుతూ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందించాయి..
undefined
కరోనా కేసుల అప్‌డేట్స్‌తో, మరణాల లెక్కలతో విసిగిపోయిన జనాలకు ఐపీఎల్ మంచి రిలీఫ్‌ను అందించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపుతూ సాగిన మ్యాచ్‌లు, క్రికెట్ అభిమానులకు నూటికి నూరు శాతం వినోదాన్ని పంచాయి. దీంతో టీఆర్పీలు రికార్డులు కూడా మారిపోయాయి.
undefined
బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఐపీఎల్ వీక్షకుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 23 శాతం పెరిగిందట.
undefined
ఐపీఎల్ 2019 సీజన్‌కి 27.3 మిలియన్ల సగటు ఇంప్రెషన్స్ రాగా.. ఐపీఎల్ 2020 సీజన్‌లో అది ఏకంగా 31.57 మిలయన్లకు చేరింది...
undefined
అత్యధిక టీవీ వ్యూయర్‌షిప్ సాధించిన మొట్టమొదటి స్పోర్ట్స్ టోర్నమెంట్‌గా కూడా రికార్డు క్రియేట్ చేసింది 2020 ఐపీఎల్ సీజన్...
undefined
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల కంటే ఇంగ్లాండ్‌లోనూ ఐపీఎల్‌కి అత్యధిక వ్యూయర్‌షిప్ రావడం మరో రికార్డు...
undefined
ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ, బెంగాళీ, కన్నడ భాషల్లో ప్రసారమైన 2020 ఐపీఎల్ సీజన్ మొత్తంగా 573 మిలియన్ల కంటే ఎక్కువగానే వ్యూయర్‌షిప్ సాధించినట్టు అంచనా...
undefined
యూఏఈ కాలమానం ప్రకారం మ్యాచ్‌లను అరగంట ముందుకి జరిపి 7:30 నిమిషాలకే ప్రారంభించడం కూడా వ్యూయర్‌షిప్ పెరగడానికి దోహదపడింది...
undefined
click me!