IPL 2020: ధోనీ జట్టు గెలవాలి దేవుడా... ప్రార్థనలు చేస్తున్న రాజస్థాన్, సన్‌రైజర్స్ ఫ్యాన్స్...

First Published Oct 29, 2020, 8:15 PM IST

IPL 2020 సీజన్ దాదాపు ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే బెర్తు కన్ఫార్మ్ చేసుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ప్లేఆఫ్‌కి అర్హత సాధించడానికి మిగిలిన ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. దీంతో పాయింట్ల పట్టికలో కింది వరుసలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ భవితవ్యాన్ని కేకేఆర్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ నిర్ణయించనుంది. 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ధోనీ సేన గెలవాలని కోరుకుంటున్నారు రాజస్థాన్, హైదరాబాద్ అభిమానులు....
undefined
బేసిగ్గానే ఐపీఎల్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ సీఎస్‌కేకి సారథిగా వ్యవహారిస్తుండడమే దీనికి ప్రధాన కారణం.
undefined
అయితే నేటి మ్యాచ్‌లో చెన్నై గెలవాలని కోరుకోవడానికి కారణం మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ మీదో లేక ధోనీ ఉన్న ప్రేమ మాత్రం కారణం కాదు... నేటి మ్యాచ్ హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మ్యాచ్ ఫలితాలను నిర్ణయిస్తుండడమే.
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 12 మ్యాచుల్లో 6 మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే మెరుగైన రన్‌రేట్ లేని కారణంగా మళ్లీ టాప్ 4లోకి వెళుతుంది. దీంతో ప్లేఆఫ్ రేసులో ఉండే జట్ల సంఖ్య తగ్గిపోతుంది.
undefined
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, కోల్‌కత్తా మధ్య ప్లేఆఫ్ రేసు నడుస్తుంది.
undefined
12 మ్యాచుల్లో ఐదేసి మ్యాచులు మాత్రమే గెలిసిన సన్‌రైజర్స్, రాజస్థాన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో గెలవడంతో పాటు టాప్‌లో ఉన్న జట్లలో కనీసం రెండు జట్లైనా మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏడేసి విజయాలతో ఆరు జట్ల మధ్య రన్‌రేట్ ఆధారంగా పోటీ నడుస్తుంది.
undefined
నేటి మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే రేపటి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లకీ ఈ మ్యాచ్ కీలకం అయినా రాజస్థాన్ ప్లేఆఫ్ రేసులో ఉంటుందా? లేదా అనేది తెలియనుంది.
undefined
ప్లేఆఫ్ రేసులో మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచేందుకు కాస్తో కూస్తో రాజస్థాన్ రాయల్స్‌కే రాబోయే మ్యాచులు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన మ్యాచుల్లో పంజాబ్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలబడబోతోంది ఆర్ఆర్.
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది. ముంబై ఇప్పటికే ప్లేఆఫ్ చేరగా బెంగళూరు ప్లేఆఫ్ చేరాలంటే మరో మ్యాచ్ గెలవాలి. దీంతో ఈ రెండు జట్లపై విజయాలు సాధించాలంటే అంత తేలికయ్యే పనికాదు.
undefined
పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉండడం చాలా అవసరం కాబట్టి ముంబై, బెంగళూరు, ఢిల్లీ రాబోయే మ్యాచుల్లో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తాయి. అందుకే నేటి మ్యాచ్‌లో చెన్నై గెలవాలని కోరుకుంటూ రాజస్థాన్, సన్‌రైజర్స్ అధికారిక ఖాతాలు కూడా ట్వీట్ చేశాయి.
undefined
click me!