రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన భారీ స్కోరింగ్ ఫైట్‌లోమ్యాచ్‌పై ఆశలు కోల్పోయిన స్థితి నుంచి ముంబై పోరాడిన తీరు అసాధారణం.
లక్ష్యచేధనలో త్వరగా 4 వికెట్లు కోల్పోయినాచివరి 5 ఓవర్లలో 90 పరుగులు చేసింది ముంబై.
ఇషాన్ కిషన్ 99 పరుగులతో, కిరన్ పోలార్డ్ 60 పరుగులతో అదరగొట్టారు.
అయితే సూపర్ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే చేసి, దాన్ని నిలువరించలేక ఓటమి మూటకట్టుకుంది.
బుమ్రా వేసిన ఓవర్‌లో సింగిల్స్ తీస్తూ, ఆఖరి బంతికి బౌండరీ కొట్టి లక్ష్యాన్ని చేధించింది బెంగళూరు.
అయితే ముంబై ప్లేయర్ లసిత్ మలింగ ఉండి ఉంటే... పరిస్థితి వేరేలా ఉండేదని అంటున్నారు ముంబై ఫ్యాన్స్.
చెన్నై ఫ్యాన్స్ సురేశ్ రైనా, ఐపీఎల్‌కి తిరిగి రావాలని కోరుకుంటున్న వేళ, ముంబై అభిమానులు మలింగ ఉండాల్సిందని కోరుతూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
తన యార్కర్లతో ముంబై నాలుగు సార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మలింగ ఉంటే, మ్యాచ్ వన్‌సైడ్ అయ్యేదని అంటున్నారు ఎమ్‌ఐ అభిమానులు.
చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సిన దశలో అద్భుతంగా బౌలింగ్ చేసి, ముంబైకి విజయాన్ని అందించిన మలింగ ఓవర్‌ను గుర్తు చేసుకుంటున్నారు.
వ్యక్తిగత కారణాల వల్ల మలింగ, ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.
కరోనా టైమ్‌లో తన తండ్రికి తోడుగా ఉండేందుకు కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా పక్కనబెట్టేశాడు మలింగ.