డేవిడ్ వార్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ భారమంతా డేవిడ్ వార్నర్ పర్ఫామెన్స్‌పైనే ఆధారపడి ఉంది. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడడంతో చేతిలో వికెట్లు ఉన్నా భారీ స్కోరు చేయలేకపోయింది సన్‌రైజర్స్.
పృథ్వీషా: మొదటి మ్యాచ్‌లో విఫలమైనా, రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు పృథ్వీషా. షా నిలదొక్కుకుంటే ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెడుతుంది.
బెయిర్‌స్టో: బెంగళూరుతో 61 పరుగులతో అద్భుతంగా రాణించాడు బెయిర్‌స్టో. కానీ రెండో మ్యాచ్‌లో 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. డేవిడ్ వార్నర్‌కి తోడుగా బెయిర్‌స్టో మంచి ఇన్నింగ్స్ ఆడితే సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేయడం గ్యారెంటీ.
శిఖర్ ధావన్: సొగసైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో దిట్ట శిఖర్ ధావన్. రెండో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో మెప్పించిన ధావన్, ఓ భారీ కమ్‌బ్యాక్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.
కేన్ విలియంసన్: సన్‌రైజర్స్ భద్రంగా దాచిపెట్టిన ఆయుధం కేన్ విలియంసన్. మొదటి రెండు మ్యాచుల్లో కేన్ మామ జట్టులో ఉండి ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేది. నేటి మ్యాచ్‌లో కేన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
శ్రేయాస్ అయ్యర్: నిలకడైన ప్రదర్శనకు మారు పేరు శ్రేయాస్ అయ్యర్. అయితే ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచుల్లో అతని నుంచి సరైన ఇన్నింగ్స్ రాలేదు.
రబాడా: వరల్డ్ క్లాస్ పేసర్ రబాడా, ఐపీఎల్‌లో కూడా అదే రేంజ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. పంజాబ్‌పై సూపర్ ఓవర్‌లో 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన రబాడా, సన్‌రైజర్స్‌ను ఎలా అడ్డుకుంటాడో చూడాలి.
మనీశ్ పాండే: మనీశ్ పాండే మంచి ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యాచుల్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి మనీశ్ నుంచి నేడు కూడా అలాంటి ఇన్నింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
స్టోయినిస్: మొదటి మ్యాచ్‌లో ఆఖర్లో వచ్చి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు స్టోయినిస్. ఈ ఆసీస్ ప్లేయర్‌కి నేటి మ్యాచ్‌లో కూడా అలాంటి అవకాశం రావచ్చు.
మహ్మద్ నబీ: వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడం నబీ స్పెషాలిటీ. అయితే నబీ వరుసగా విఫలమవ్వడం సన్‌రైజర్స్‌కి బాగా ఇబ్బందికి గురి చేస్తోంది. బౌలింగ్‌లోనూ చెప్పుకోదగ్గ వికెట్లు తీయలేకపోయాడు నబీ.
రిషబ్ పంత్: పంత్ ఫామ్‌లోకి వచ్చాడంటే బౌండరీలు, సిక్సర్లతో బౌలర్లను ఉతికి పారేస్తాడు. సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోతాడు. సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తుండడంతో రిషబ్ పంత్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారనుంది.
ప్రియమ్ గార్గ్: ఈ అండర్ 19 టీమిండియా కెప్టెన్‌పై భారీ అంచనాలు పెట్టుకొని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు ప్రియమ్.
భువనేశ్వర్ కుమార్: మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసి ప్రత్యర్థి జట్టును ఇబ్బందుల్లో పడేయడం భువీ స్పెషల్. కానీ రెండు మ్యాచుల్లో 7 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ తీయలేకపోయాడు భువీ. అంతేకాకుండా భారీగా పరుగులు కూడా ఇచ్చాడు.
రషీద్ ఖాన్: ఈ స్టార్ స్పిన్నర్ రెండు మ్యాచుల్లో కలిపి ఒకే ఒక్క వికెట్ తీశాడు. రషీద్ 3 వికెట్లు తీస్తే ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి విజయం దక్కినట్టే. రషీద్ నుంచి ఆ రేంజ్‌లో పర్ఫామెన్స్ కోరుకుంటోంది సన్‌రైజర్స్.
వృద్ధమాన్ సాహా: గత మ్యాచ్‌లో టూ డౌన్‌లో వచ్చిన వృద్ధమాన్ సాహా... టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రన్‌రేట్ భారీగా పడిపోయి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్వల్ప స్కోరుకే పరిమితం కావడానికి సాహా కూడా ఓ కారణం.
హెట్మయర్: భారీ షాట్లు ఆడడంలో హెట్మయర్ హిట్టింగ్ రేంజ్ వేరుగా ఉంటుంది. అయితే ఐపీఎల్‌లో మాత్రం అలాంటి ఇన్నింగ్స్ ఇప్పటిదాకా ఆడలేకపోయాడు హెట్మయర్. ఢిల్లీ హెట్మయర్ నుంచి ఓ భారీ తుఫాన్ ఇన్నింగ్స్ కోరుకుంటోంది.
రహానే: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న మరో క్లాసిక్ ప్లేయర్ అజింకా రహానే. రాజస్థాన్ నుంచి ఢిల్లీ జట్టులోకి వచ్చిన అజింకా రహానేకి ఇప్పటిదాకా అవకాశం రాలేదు.