ఐపీఎల్ ‘డక్’ రికార్డులు... రోహిత్ శర్మ, అంబటి రాయుడితో పాటు...

First Published Sep 17, 2020, 6:18 PM IST

ఐపీఎల్ పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఫేవరెట్ లీగ్. బంతి పడేదే ఆలస్యం, బౌండరీ దాటించేందుకు ఎదురుచూస్తూ ఉంటారు బ్యాట్స్‌మెన్. అలాంటి ఐపీఎల్‌లో డకౌట్‌లు కూడా రికార్డు లెవల్లో నమోదయ్యాయి. భారీ సిక్సర్లు బాదాలని అత్యుత్యాహాంతో కొందరు, ఒత్తిడిని తట్టుకోలేక మరికొందరు, బౌలర్ల మాయాజాలంతో ఇంకొందరు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు. ఇలా ఐపీఎల్‌లో నమోదైన ‘డకౌట్’ రికార్డులు ఇవి...

110 డకౌట్లు: ఐపీఎల్‌లో అత్యంత దారుణమైన చరిత్ర కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్‌లో అత్యధిక డకౌట్లు నమోదుచేసిన మూడో జట్టుగా నిలిచింది. ఇప్పటిదాకా ఆర్‌సీబీ ప్లేయర్లు 110 సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు.
undefined
ముంబై ఇండియన్స్: నాలుగు సార్లు టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఖాతాలో ఉన్న చెత్త రికార్డు ఇది. ముంబై బ్యాట్స్‌మెన్ 115 సార్లు ఒట్టిచేతులతో పెవిలియన్ చేరారు. అత్యధిక డకౌట్లు కలిగిన రెండో జట్టు ముంబై..
undefined
117 డకౌట్లు: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు కూడా ఏ మాత్రం బాగోలేదు. గత సీజన్‌లో బాగానే ఆడినా, అంతకుముందు సీజన్ల కారణంగా ఇప్పటిదాకా 117 డకౌట్లు ఢిల్లీ జట్టు నుంచి నమోదయ్యాయి. ఢిల్లీ మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆరు సార్లు డకౌట్ కావడం విశేషం. అత్యధిక డకౌట్లు ఉన్న ఐపీఎల్ జట్టు డీసీయే.
undefined
13 సార్లు డకౌట్: భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్ పేరిట ఉన్న చెత్త రికార్డు ఇది. లీగ్‌లో అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన ప్లేయర్లు ఈ ఇద్దరే.
undefined
చెత్త రికార్డులో రోహిత్ కూడా: ముంబై సారథి రోహిత్ శర్మకి కూడా ఈ చెత్త రికార్డులో భాగం ఉంది. లీగ్‌లో రోహిత్ శర్మ ఇప్పటిదాకా 12 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు
undefined
మనీశ్ పాండే, అంబటి రాయుడు, గౌతమ్ గంభీర్ వంటి బ్యాట్స్‌మెన్‌తో పాటు పియూష్ చావ్లా కూడా 12 సార్లు డకౌట్ అయ్యి, రెండో స్థానంలో ఉన్నారు.
undefined
రహానే 11 సార్లు, అమిత్ మిశ్రా 10 సార్లు, మన్‌దీప్ సింగ్ 10 సార్లు, అశ్విన్, ప్రవీణ్ కుమార్, మ్యాక్స్‌వెల్, కలీస్, యూసఫ్ పఠాన్ లీగ్‌లో తొమ్మిదిసార్లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరారు.
undefined
లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనా కూడా 8 సార్లు డకౌట్ అయ్యాడు.
undefined
‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ శిఖర్ ధావన్, కేదార్ జాదవ్ ఆరు సార్లు డకౌట్ అయ్యారు.
undefined
click me!