మ్యాక్స్‌వెల్ మెరిశాడు, అలెక్స్ అదరగొట్టాడు... ఇంగ్లాండ్‌కి షాక్...

First Published Sep 17, 2020, 9:58 AM IST

చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన చివరి వన్డే... ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టో సెంచరీ... 73/5 స్కోరు నుంచి వీరోచితంగా కోలుకున్న ఆస్ట్రేలియా... మ్యాక్స్‌వెల్, ఆలెక్స్ క్యారీ సెంచరీలు!

ఇంగ్లాండ్‌ టూర్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది ఆసీస్. మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
undefined
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్... స్టార్క్ దెబ్బకు తొలి రెండు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయింది.
undefined
అయితే ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టో సెంచరీతో చెలరేగాడు.
undefined
బిల్లింగ్స్ 57, క్రిస్ వోక్స్‌ 53తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 302 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
undefined
క్రిస్ వోక్స్ ఈ సిరీస్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు.ఆసీస్ బౌలర్లుస్టార్క్‌, జంపా మూడేసి వికెట్లు తీసారు.
undefined
303 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. దీంతో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆసీస్.
undefined
ఇక ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం సాధించడం పక్కా అనుకున్నారంతా... అయితే మ్యాక్స్‌వెల్, ఆలెక్స్‌ క్యారీ కలిసి వీరోచితంగా పోరాడారు.
undefined
మ్యాక్స్‌వెల్ 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 108 పరుగులు చేయగా, అలెక్స్ క్యారీ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు.చివర్లో ఈ ఇద్దరూ అవుటైనా మిచెల్ స్టార్క్ 11 మిగిలిన లాంఛనాన్ని పూర్తిచేశాడు.
undefined
సెంచరీతో అదరగొట్టిన మ్యాక్స్‌వెల్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
undefined
click me!