IPL 2020: ఇషాన్ కిషన్‌‌కు అన్యాయం జరిగిందా... కనీసం అది కూడా ఇవ్వకుండా...

First Published Sep 29, 2020, 5:39 PM IST

IPL 2020లో తన కెరీర్‌లో గుర్తిండిపోయే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ముంబై ఆటగాడు ఇషాన్ కిషన్. రెండు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చి 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99 పరుగులు చేసి... అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన అన్ క్యాప్‌డ్ ప్లేయర్ల లిస్టులోకి ఇషాన్ కిషన్..

రెండు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చి 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99 పరుగులు చేశాడు...
undefined
కీలక సమయంలో భారీ షాట్లతో విరుచుకుపడిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్, జట్టు విజయం కోసం 200 శాతం పోరాడాడు.
undefined
అయితే ఆఖరి ఓవర్ ఐదో బంతికి కిషన్ అవుట్ కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసింది.
undefined
ఈ సూపర్ ఓవర్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది.
undefined
అయితే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కలేదు.
undefined
మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఏబీ డివిల్లియర్స్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇచ్చారు.
undefined
గెలిచిన జట్టులోని ప్లేయర్‌కే ‘మ్యాన్ ఆఫ్ ది అవార్డు’ ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదు.
undefined
భారత జట్టు ఓడిన సందర్భాల్లోనూ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు సచిన్ టెండూల్కర్.
undefined
మరి కిషన్‌కి మాత్రం ఆ అవార్డు ఇవ్వకుండా ఎందుకు చిన్నచూపు చూశారని నిలదీస్తున్నారు క్రికెట్ అభిమానులు.
undefined
బీహార్‌లో జన్మించిన ఇషాన్ కిషన్, ఇప్పటిదాకా భారత జట్టుకి ఎంపిక కాలేదు. కాని ఐపీఎల్‌లో 38 మ్యాచులాడి 4 హాఫ్ సెంచరీలు బాదాడు.
undefined
సచిన్, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా వంటి స్టార్లు విఫలమైన చోట ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్... నిజంగా ఓ సూపర్ క్లాస్ ఇన్నింగ్స్.
undefined
మంచి ఇన్నింగ్స్ ఆడినా ముంబైని గెలిపించలేకపోయాననే బాధ కిషన్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వచ్చివుంటే ఆ బాధ కాస్తైనా తగ్గి ఉండేది.
undefined
click me!