IPL 2020: ధోనీ గనక ఈ ఇన్నింగ్స్ ఆడి ఉంటే... ‘బొమ్మ దద్దరిల్లేది’...

First Published Sep 28, 2020, 5:34 PM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై రాహుల్ త్రివాటియా ఆడిన ఇన్నింగ్స్... మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటు నుంచి వచ్చివుంటే... ధోనీ అభిమానుల పోస్టులతో సోషల్ మీడియా ప్రపంచం ఉప్పెంగిపోయేది. మొదట్లో రాహుల్ త్రివాటియాను విమర్శించిన ఐపీఎల్ ఫ్యాన్స్... ఆ తర్వాత సీన్ మొత్తం రివర్స్...

రాహుల్ త్రివాటియా... మొదటి 23 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసి, పంజాబ్ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేశాడు.
undefined
అయితే ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి, జెట్ స్పీడ్‌లోకి తన బ్యాటింగ్ స్టైల్ మార్చేశాడు రాహుల్ త్రివాటియా.
undefined
ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదిన రాహుల్ త్రివాటియా... రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్‌కి ‘గేమ్ ఛేజింగ్’ హీరోగా మారిపోయాడు.
undefined
తాను ఆడిన చివరి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. 18 బంతుల్లో 51 పరుగులు కావాల్సిన దశలో రాహుల్ త్రివాటియా ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.
undefined
రాహుల్ ఆడిన ఇన్నింగ్స్, ధోనీ బ్యాటు నుంచి జాలువారి ఉంటే... ఈ ఆలోచనే ఓ సెన్సేషన్!
undefined
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 216 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 200 పరుగులకే పరిమితమైంది.
undefined
ఈ మ్యాచ్‌లో కూడా మొదట స్లోగా బ్యాటింగ్ చేసిన ధోనీ, ఆఖర్లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.
undefined
అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మ్యాచ్‌లో చెన్నై ఓటమి ఖరారైంది.
undefined
రాహుల్ త్రివాటియాలా కరెక్ట్ టైమ్‌కి ధోనీ గేర్ మార్చి ఉంటే... సోషల్ మీడియాలో మాహీ ఫ్యాన్స్ ప్రభంజనం సృష్టించేవాళ్లు.
undefined
మాజీ క్రికెటర్లతో పాటు ధోనీని వేలెత్తి చూపిన చేతులన్నీ సెల్యూట్ చేసేవి.
undefined
ఈ ఏడాది టైటిల్ గెలవకపోయినా ‘తలైవా’ ఇన్నింగ్స్‌తో ఫుల్లుగా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్లు ధోనీ ఫ్యాన్స్.
undefined
కానీ రాహుల్ ట్రైయిన్ కరెక్టు టైమ్‌కి స్పీడ్ పెంచుకుంటే... ధోనీ ట్రైన్ పట్టాలు మారిన తర్వాత స్పీడ్ పెరిగిందంతే.
undefined
click me!