IPL 2020: పూరన్... గాల్లోకి ఎగురుతూ భలే ఆపడబ్బా..

First Published | Sep 28, 2020, 4:58 PM IST

సచిన్ టెండూల్కర్‌తో పాటు క్రికెట్ ప్రపంచం మొత్తం... పూరన్ ఫీల్డింగ్ విన్యాసానికి ఫిదా!!

ఐదేళ్ల క్రితం కారు యాక్సిడెంట్‌లో పూరన్ రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలు...

లేచి నడవడం కూడా కష్టమేనని చెప్పిన డాక్టర్లు... విధిని జయించి క్రికెట్ ఫీల్డ్‌లోకి పూరన్...

నికోలస్ పూరన్... ఈ విండీస్ మొదటి మ్యాచ్‌లో రెండు సార్లు డకౌట్ అయినా, అతనిపై నమ్మకం ఉంచాడు పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్.
ఆ నమ్మకాన్ని రుజువు చేస్తూ బ్యాటింగ్‌లో అదరగొట్టే ఇన్నింగ్స్ ఇంకా ఆడలేకపోయినా, అద్భుతమైన ఫీల్డింగ్‌తో క్రికెట్ ప్రపంచం ప్రశంసలు అందుకున్నాడు పూరన్.

నిజానికి పూరన్‌కి ఐదేళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యింది.
కారు ప్రమాదంలో నికోలస్ పూరన్ రెండు కాళ్లకి తీవ్రంగా గాయమైంది. తిరిగి లేచి, మామూలుగా నడవడం కూడా కష్టమేనని చెప్పారు డాక్టర్లు.
తిరిగి క్రికెట్ ఆడడం అసాధ్యమని తేల్చేశారు వైద్యులు.
అయితే పూరన్ పట్టుదలకి విధి కూడా తలవంచింది.
తిరిగి లేచి తన కాళ్లపై నిలబడిన పూరన్... క్రికెట్ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టి అద్భుతాలు చేస్తున్నాడు.
గత వన్డే వరల్డ్‌కప్‌లో సెంచరీ చేసిన పూరన్, నిన్నటి మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ 4 పరుగులు ఆపాడు.
సచిన్ టెండూల్కర్‌తో పాటు క్రికెట్ ప్రపంచం మొత్తం పూరన్ ఫీల్డింగ్ విన్యాసానికి ఫిదా అయ్యింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్... పూరన్ ఫీల్డింగ్ చూసి పైకి లేచి చప్పట్లు కొట్టాడు.
సచిన్, సెహ్వాగ్, వినోద్ కాంబ్లీతో పాటు సీనియర్ క్రికెటర్లు అందరూ తాము చూసిన ‘గ్రేటెస్టు ఫీల్డింగ్స్‌లో పూరన్ ఫీల్డింగ్ ఒకట’ని కొనియాడారు.

Latest Videos

click me!