RCB vs MI: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

First Published | Sep 28, 2020, 4:32 PM IST

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఓ వైపు నాలుగుసార్లు ఐపిఎల్ టైటిల్ గెలిచిన టీమ్ ముంబై ఇండియన్స్, మరోవైపు మూడు సార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఛాంపియన్ కాలేకపోయిన బెంగళూరు మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

రోహిత్ శర్మ: మొదటి మ్యాచ్‌లో ఫెయిల్ అయినా రెండో మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ. 80 పరుగులతో చెలరేగి ముంబైకి భారీ స్కోరు అందించాడు. బెంగళూరుపై కూడా రోహిత్ ‘హిట్ మ్యాన్‌‌’లా మారొచ్చు.
విరాట్ కోహ్లీ: మొదటి మ్యాచ్‌లో 14 పరుగులు చేసిన కోహ్లీ, రెండో మ్యాచ్‌లో 1 పరుగుకే అవుట్ అయ్యాడు. కోహ్లీ తన రియల్ ఫామ్ కోల్పోయి చాలా రోజులైంది. ముంబైపై మ్యాచ్‌లో కోహ్లీ ఫామ్‌లోకి వస్తే, హోరాహోరీ ఫైట్ చూడొచ్చు.

డి కాక్: మంచి ఫామ్‌లో ఉన్నడి కాక్, ముంబై ఇండియన్స్‌కి మంచి ఆరంభం అందించాడు.నేటి మ్యాచ్‌లో రోహిత్, డి కాక్‌లను ఎంత త్వరగా అవుట్ చేస్తారనేదానిపైనే ఆర్‌సీబీ విజయావకాశాలు డిసైడ్ అవుతాయి.
ఏబీ డివిల్లియర్స్: రెండు మ్యాచుల్లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడిన ఏబీ డివిల్లియర్స్‌పైనే ప్రస్తుతం బెంగళరు రాయల్ ఛాలెంజర్స్ ఆశలన్నీ పెట్టుకుంది.
సూర్యకుమార్ యాదవ్: మంచి స్టైయిక్ రేటు మెయింటైన్ చేస్తూ పరుగులు చేయడంలో సూర్యకుమార్ యాదవ్ దిట్ట. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు ఈ ముంబై టాపార్డర్ ప్లేయర్.
దేవ్‌దత్ పడిక్కల్: మొదటిసారి బ్యాటింగ్ చేస్తున్న ఆ ఫీలింగ్ ఎక్కడా తెలియకుండా అద్భుతంగా ఆడాడు దేవ్‌దత్ పడిక్కల్. ఎంట్రీ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. పడిక్కల్ నుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఆశించొచ్చు.
నవ్‌దీప్ శైనీ: డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల ఈ పేసర్, తన స్థాయికి తగ్గ పర్ఫెమన్స్ ఇవ్వలేకపోతున్నాడు.
డేల్ స్టెయిన్: ఎలాంటి బ్యాట్స్‌మెన్‌కైనా వెన్నులో వణుకు పుట్టించిన డేల్ స్టెయిన్ కూడా ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు.
చాహాల్: ఏబీ డివిల్లియర్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో రాణిస్తున్న ప్లేయర్ యజ్వేంద్ర చాహాల్ మాత్రమే. చాహాల్ నిలకడగా రాణిస్తూ, వికెట్లు తీస్తున్నా అతనొక్కడే విజయాలను అందించలేడు.
హార్ధిక్ పాండ్యా: గత మ్యాచ్‌లో హిట్ వికెట్ రూపంలో అవుటైన పాండ్యా... కమ్‌బ్యాక్ తర్వాత తన రేంజ్ ఇన్నింగ్స్ ఇంతవరకూ ఆడలేదు.
జోస్ ఫిలిప్: ఈ ఆసీస్ యంగ్ బ్యాట్స్‌మెన్‌పైనే భారీ అంచనాలే పెట్టుకుంది ఆర్‌సీబీ. అయితే ఆ రేంజ్ పర్ఫామెన్స్ మాత్రం ఫిలిప్ నుంచి రాలేదు. రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు ఫిలిప్.
ట్రెంట్ బౌల్ట్: ముంబై ఇండియన్స్‌లో కీ బౌలర్‌గా మారాడు ట్రెంట్ బౌల్ట్. రెండు మ్యాచుల్లో 3 వికెట్లు తీసిన బౌల్ట్, పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు.
జస్ప్రిత్ బుమ్రా: మొదటి మ్యాచ్‌లో భారీ పరుగులిచ్చినా, రెండో మ్యాచ్‌లో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు బుమ్రా. కోహ్లీ జట్టుపై బుమ్రా ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చూడాలి.
సౌరబ్ తివారీ: భారీ సిక్సర్లతో విరుచుకుపడే సౌరబ్ తివారీ, మొదటి మ్యాచ్‌లో 42 పరుగులు చేసినా... రెండో మ్యాచ్‌లో త్వరగా అవుట్ అయ్యాడు. తివారీ నుంచి నిలకడైన ఇన్నింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తోంది ముంబై.
పోలార్డ్: ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలిచిన పోలార్డ్... ముంబై జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్నాడు. అయితే పోలార్డ్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ వచ్చి చాలా రోజులైంది.

Latest Videos

click me!