బాగుంది కానీ ఆ ముగ్గురూ ఉండి ఉంటే... టీ20 వరల్డ్ కప్‌ 2022 టీమ్‌పై మాజీ కెప్టెన్...

Published : Sep 15, 2022, 11:29 AM IST

ఆసియా కప్ 2022 రిజల్ట్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో సంచలన మార్పులు ఉంటాయని భావించారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే ఆసియా కప్‌ టీమ్‌నే దాదాపు రిపీట్ చేసిన సెలక్టర్లు, జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లను చేర్చి గాయపడిన రవీంద్ర జడేజా, ఆవేశ్ ఖాన్‌లను టీమ్ నుంచి తప్పించారు. టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్‌కి చోటు దక్కకపోవడంతో తీవ్రమైన చర్చ జరుగుతోంది...

PREV
17
బాగుంది కానీ ఆ ముగ్గురూ ఉండి ఉంటే... టీ20 వరల్డ్ కప్‌ 2022 టీమ్‌పై మాజీ కెప్టెన్...
Sanju Samson-Rishabh Pant

ఐపీఎల్‌లో మంచి పర్ఫామెన్స్ కనబర్చిన సంజూ శాంసన్, ఈ ఏడాది ఆడిన టీ20 మ్యాచుల్లోనూ రిషబ్ పంత్ కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా రిషబ్ పంత్‌కి మరో అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, మరోసారి సంజూ శాంసన్‌కి అన్యాయం చేశారు.. 

27

‘టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఉన్నంతలో మంచి టీమ్‌నే సెలక్ట్ చేశారు కానీ నేను అయితే మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్,శుబ్‌మన్ గిల్‌లను ఎంపిక చేసేవాడిని. వాళ్లు ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడారు. వారికి వరల్డ్ కప్ ఆడే అవకాశం కల్పిస్తే టీమిండియాకి విజయావకాశాలు పెరుగుతాయి...

37

ముఖ్యంగా మహ్మద్ షమీకి టీ20 వరల్డ్ కప్‌ జట్టులో చోటు దక్కకపోవడం అన్యాయం. హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్‌ల్లో మహ్మద్ షమీకి ఉండే స్పీడ్ ఉండదు... కేవలం జస్ప్రిత్ బుమ్రా మాత్రం షమీ కంటే కాస్త ఎక్కువ పేస్‌తో బౌలింగ్ చేయగలడు...

47

రవీంద్ర జడేజా లేని లోటు టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బే. అతను భారత జట్టుకి చాలా కీలకమైన ప్లేయర్. ముఖ్యంగా అతను బ్యాటుతో చేసే పరుగులు, భారత జట్టుకి చాలా కీలకం. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో జడ్డూ ఉండి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది...

57

రవీంద్ర జడేజా ఏ బ్యాటింగ్ పొజిషన్‌లో అయినా బ్యాటింగ్ చేయగలడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన జడ్డూ... ఫినిషర్ రోల్ కూడా పోషించగలడు. జడ్డూ గాయం, టీమ్ మేనేజ్‌మెంట్‌ను షాక్‌కి గురి చేసి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్...

67
Image credit: PTI

ఐపీఎల్‌ 2022 టైటిల్ విన్నర్ గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన మహ్మద్ షమీ, 16 మ్యాచుల్లో 20 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడని షమీకి స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే పొట్టి ప్రపంచకప్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు...

77
Image credit: Getty

గుజరాత్ టైటాన్స్‌కి కీలక ప్లేయర్‌గా మారిన శుబ్‌మన్ గిల్, 16 మ్యాచుల్లో 483 పరుగులు చేసి అదరగొట్టగా... ఉమ్రాన్ మాలిక్, ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 22 వికెట్లు తీసి 14 మ్యాచుల్లో ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ మ్యాచ్’ అవార్డులు గెలిచాడు...

Read more Photos on
click me!

Recommended Stories