అమీర్ చేసిన పని, పాకిస్తాన్ క్రికెట్ పరువు తీస్తుంది... మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆవేదన...

First Published Dec 26, 2020, 9:03 AM IST

పాకిస్తాన్ క్రికెట్ జట్టును సమర్థవంతంగా నడిపించిన కెప్టెన్లలో ఇంజమామ్ వుల్ హక్ ఒకడు. ఒకానొక దశలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లతో పోటీపడి పరుగులు చేసిన ఇంజమామ్... రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ‘తనను మానసికంగా టార్చర్ చేశారంటూ’ ఆరోపిస్తూ రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ పేసర్ మహ్మద్ అమీర్ వివాదంపై స్పందించాడు ఇంజమామ్.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహారిస్తున్న తీరుపై చాలా ఏళ్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. టాలెంట్ ఉన్న క్రికెటర్లకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే వాళ్లు ఛాన్సులు వెతుక్కుంటూ విదేశాల బాట పడుతున్నారంటూ ఆరోపించాడు మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.
undefined
పాక్ క్రికెట్ బోర్డు నుంచి తాను విపరీతమైన మెంటల్ టార్చర్ భరించానని, ఇంకా భరించే ఓపిక లేదంటూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మహ్మద్ అమీర్.
undefined
29 ఏళ్ల వయసులో మహ్మద్ అమీర్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం పాక్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు పీసీబీని తప్పుబడుతుంటే, మరికొందరు అమీర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
undefined
‘ప్లేయర్లకు ఎవ్వరితోనైనా సమస్యలు ఉండే హెడ్ కోచ్‌తో మాట్లాడి పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి... అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడాలి...
undefined
పాక్ బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌తో మహ్మద్ అమీర్‌కి కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయని తెలిసింది... అంతేకాని ఇలా రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది కాదు..
undefined
అమీర్ హఠాత్తుగా తప్పుకోవడం వల్ల పాక్ బౌలింగ్ యూనిట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది... అతను తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా పాక్ క్రికెట్ పరువు తీస్తుంది...’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఇంజమామ్ వుల్ హక్.
undefined
పాక్ బౌలింగ్ కోచ్‌తో పాటు హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్‌తో కూడా తనకు విబేధాలు ఉన్నాయని, ఇద్దరూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించాడు మహ్మద్ అమీర్.
undefined
టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని పాక్ క్రికెట్ బోర్డు తప్పుగా అర్థం చేసుకుందని, టీ20 లీగ్‌లు ఆడేందుకు ఇలా చేస్తున్నానంటూ చులకనగా మాట్లాడిందని చెప్పాడు మహ్మద్ అమీర్.
undefined
click me!