INDvsAUS 2nd Test: రహానే దింపాడు, అశ్విన్ తీశాడు... 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా, స్మిత్ డకౌట్...

Published : Dec 26, 2020, 06:53 AM ISTUpdated : Dec 26, 2020, 06:54 AM IST

బాక్సింగ్ డే టెస్టు మొదటి రోజు మొదటి సెషన్‌లో భారత బౌలర్లు ఆధిపత్యం సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతి థ్య ఆస్ట్రేలియా, 15 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐసీసీ నెం.1 టెస్టు బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ డకౌట్ కావడం మరో విశేషం...25 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.

PREV
19
INDvsAUS 2nd Test: రహానే దింపాడు, అశ్విన్ తీశాడు... 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా, స్మిత్ డకౌట్...

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా, జస్ప్రిత్ బుమ్రా మొదటి షాక్ ఇచ్చాడు.

29

10 బంతులు ఆడి పరుగులేమీ చేయలేకపోయిన ఆసీస్ ఓపెనర్ జో బర్న్స్.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

39

మరో ఓపెనర్ మాథ్యూ వేడ్... తన స్టైల్‌లో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 39 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు వేడ్...

49

అయితే 10వ ఓవర్‌లోనే రవిచంద్రన్ అశ్విన్‌కి బౌలింగ్ ఇచ్చిన కెప్టెన్ అజింకా రహానే అదిరిపోయే ఫలితాన్ని రాబట్టాడు. 

59

అశ్విన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన మాథ్యూ వేడ్... రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

69

వేడ్ క్యాచ్ అందుకునే సమయంలో శుబ్‌మన్ గిల్ అడ్డు వచ్చినా, క్యాచ్‌ను ఒడిసి పట్టుకున్నాడు రవీంద్ర జడేజా...

79

మెల్‌బోర్న క్రికెట్‌ స్టేడియంలో మెరుగైన రికార్డున్న స్టీవ్ స్మిత్‌ను మరోసారి బోల్తా కొట్టించాడు రవిచంద్రన్ అశ్విన్. 

89

8 బంతులు ఆడిన స్టీవ్ స్మిత్... పూజారాకి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. టీమిండియాపై టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో  స్టీవ్ స్మిత్ డకౌట్ కావడం ఇదే మొదటిసారి. 

99

ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ లబుషేన్ అవుట్ కోసం టీమిండియా రివ్యూకి వెళ్లినా, ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా ఫలితం ఆస్ట్రేలియాకి అనుకూలంగా వచ్చింది.

click me!

Recommended Stories