ముంబైలో ఓ హోటల్‌లో క్రికెటర్ పృథ్వీ షాని చూసిన జనం, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దాదాపు 70 మందితో సెల్ఫీలు దిగిన పృథ్వీ షా, తనకు లేట్ అవుతోందని అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఇన్‌స్టా మోడల్ సప్నా గిల్, తనకి సెల్ఫీ ఇవ్వాల్సిందిగా తన ఫ్రెండ్స్‌తో కలిసి పృథ్వీ షాని కోరింది..