INDW vs NEDW T20 WC: పాకిస్తాన్‌పై విక్టరీ తర్వాత నెదర్లాండ్స్‌తో టీమిండియా ఫైట్.. షెఫాలీ వర్మపైనే అందరి ఫోకస్

Published : Jun 17, 2026, 01:29 PM IST

INDW vs NEDW T20 WC: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా బుధవారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది. షెఫాలీ వర్మ ఫామ్, తుది జట్టు మార్పులపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఆ వివరాలు గమనిస్తే..

PREV
17
నెదర్లాండ్స్‌ను లైట్ తీసుకుంటే కష్టమే.. టీమిండియాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన స్టార్ ప్లేయర్

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా అదిరిపోయే రేంజ్‌లో బోణీ కొట్టింది. ఫస్ట్ మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను 64 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫుల్ జోష్‌లో ఉంది. ఇక ఇప్పుడు ఇండియా ఫోకస్ అంతా బుధవారం లీడ్స్‌లోని హెడింగ్లీ లో నెదర్లాండ్స్‌తో జరగబోయే మ్యాచ్‌పైనే ఉంది. ఈ మెగా టోర్నీలోకి ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇచ్చిన నెదర్లాండ్స్‌తో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో ఇండియానే హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ, కేవలం రెండు పాయింట్లు గెలవడమే కాకుండా.. రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి గట్టి టీమ్స్‌తో తలపడాల్సి ఉంది. అందుకే, ఆలోపు భారత్ జట్టులో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుకోవడానికి, ప్లేయర్స్ కాంబినేషన్లను సెట్ చేసుకోవడానికి ఈ మ్యాచ్ ఒక సూపర్ ఛాన్స్ అని చెప్పాలి.

27
షెఫాలీ వర్మ ఫామ్‌లోకి వచ్చేనా?

ప్రస్తుతం టీమిండియాను వేధిస్తున్న అతిపెద్ద టెన్షన్.. ఓపెనర్ షెఫాలీ వర్మ ఫామ్. గత కొన్ని వారాలుగా షెఫాలీ అస్సలు టచ్‌లోనే లేదు. ఆడిన లాస్ట్ 6 టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లలో ఆమె చేసింది కేవలం 54 రన్స్ మాత్రమే, అదీ 9 యావరేజ్‌తో ఆడింది. ఈ ఏడాది స్టార్టింగ్‌లో సౌతాఫ్రికా టూర్‌లో ఫుల్ ఫామ్‌లో కనిపించిన షెఫాలీ.. ఆ తర్వాత ఎందుకో ఆ రేంజ్‌లో ఆడలేక స్ట్రగుల్ అవుతోంది.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో ఒక భారీ సిక్స్ కొట్టి తనేంటో చూపించింది. కానీ, అదే ఓవర్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వేసిన ఒక షార్ట్ పిచ్ బాల్‌కు దొరికిపోయి వికెట్ పారేసుకుంది. వరల్డ్ కప్‌కు ముందు ఇద్దరు ఓపెనర్ల ఫామ్ టెన్షన్ పెట్టినా.. స్మృతి మంధాన పాకిస్తాన్‌పై 68 రన్స్‌తో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు అందరి కళ్లు షెఫాలీపైనే ఉన్నాయి. సౌతాఫ్రికాతో పెద్ద మ్యాచ్ జరగబోయే ముందే.. నెదర్లాండ్స్‌పై షెఫాలీ పెద్ద స్కోరు చేస్తే ఆమె కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం.

37
ఫుల్మాలి ప్లేస్‌లో యాస్తికా భాటియా?

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యాస్తికా భాటియాకు ఛాన్స్ రాలేదు. వార్మప్ మ్యాచ్‌లలో వెస్టిండీస్‌పై భారతీ ఫుల్మాలి హాఫ్ సెంచరీ కొట్టినా.. పాకిస్తాన్‌తో మెయిన్ మ్యాచ్‌లో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లోనే ఔట్ అయింది. పైగా ఫీల్డింగ్‌లో కూడా చాలా మిస్టేక్స్ చేసింది. దీంతో ఆమెను తుది జట్టులో ఉంచాలా వద్దా అనే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ ఫుల్మాలిని పక్కన పెడితే ఆ ప్లేస్‌లో ఎవరు వస్తారు?

మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్ హేమలత కాలా ప్రకారం.. యాస్తికా భాటియాకు ఈ మ్యాచ్‌లో ఛాన్స్ ఇవ్వాలి. యాస్తికా కేవలం టాప్ ఆర్డర్‌లోనే కాదు, అవసరమైతే మిడిల్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలదు. "నేను యాస్తికను ప్లేయింగ్ ఎలెవన్‌లో చూడాలనుకుంటున్నాను. ఆమె నంబర్ 3 లోనే ఆడాల్సిన అవసరం లేదు, మిడిల్ ఆర్డర్‌లో కూడా బాగా యూజ్ అవుతుంది. రీసెంట్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా ఆమె బాగా ఆడింది" అని హేమలత కాలా పీటీఐతో చెప్పారు. గాయం తర్వాత కంబ్యాక్ ఇచ్చిన యాస్తికా.. ఇంగ్లాండ్ టూర్‌లో 31 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ బాది ఫుల్ ఫామ్‌లో ఉంది.

47
రేణుకా సింగ్ రీఎంట్రీ ఇస్తుందా?

ఇండియా మెయిన్ పేస్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడలేదు. ఆమె ప్లేస్‌లో కొత్త బాల్‌తో వచ్చిన అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. కేవలం 3 ఓవర్లలోనే 35 రన్స్ ఇవ్వడంతో పాకిస్తాన్‌కు పవర్‌ప్లేలో మంచి స్టార్ట్ దొరికింది. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పారు కాబట్టి సరిపోయింది. లేదంటే అరుంధతి, క్రాంతి వేసిన ఆ ఫస్ట్ ఓవర్లు ఇండియాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసేవి.

గత సెప్టెంబర్‌లో గాయం నుంచి కోలుకున్న తర్వాత రేణుకకు టీమ్‌లో రెగ్యులర్ ఛాన్సెస్ రాలేదు. కానీ పెద్ద మ్యాచ్‌లు వచ్చేలోపు ఆమె రిథమ్‌లోకి రావాలంటే నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ ఆడించడం చాలా ముఖ్యం. ఇండియాకు ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో డెబ్యూ మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి ఇంప్రెస్ చేసిన నందిని శర్మ ఆప్షన్ కూడా ఉంది.

57
నెదర్లాండ్స్ టీమ్ ఎంతవరకు టఫ్?

నెదర్లాండ్స్ టీమ్‌ను అస్సలు తక్కువ అంచనా వేయలేం. బాబెట్ డి లీడే కెప్టెన్సీలోని డచ్ టీమ్.. లాస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను గట్టిగా ముప్పతిప్పలు పెట్టింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నెదర్లాండ్స్ బౌలింగ్ అటాక్ గురించి హెచ్చరించింది.

"వరల్డ్ కప్‌కు ముందే నేను వాళ్ల మ్యాచ్‌లు చూశాను. వాళ్ల దగ్గర మంచి బౌలర్లు ఉన్నారు. వాళ్లకు ఇది ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్ కదా, అయినా సరే చాలా బాగా ఆడుతున్నారు. మేము ఏ టీమ్‌ను తక్కువ అంచనా వేయడం లేదు, ఈ ఛాలెంజ్ కోసం వెయిట్ చేస్తున్నాం" అని రిచా ఘోష్ చెప్పింది. నెదర్లాండ్స్ టీమ్‌లో టీ20ల్లో 100కు పైగా వికెట్లు తీసిన ఐరిస్ క్విల్లింగ్, కారోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్ లాంటి కీ ప్లేయర్స్ ఉన్నారు.

67
భారత్ vs నెదర్లాండ్స్ : హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే

మహిళల టీ20 క్రికెట్ హిస్టరీలో ఇండియా, నెదర్లాండ్స్ టీమ్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా తలపడలేదు. ఇదే ఫస్ట్ టైమ్. అయితే వన్డేల్లో మాత్రం 3 సార్లు తలపడగా.. మూడు సార్లూ ఇండియానే క్లీన్ స్వీప్ చేసింది.

ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ బుధవారం రాత్రి భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో చూడవచ్చు. అలాగే మొబైల్‌లో చూడాలనుకునే వాళ్లు జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

77
భారత్ vs నెదర్లాండ్స్ : రెండు జట్ల పూర్తి స్క్వాడ్స్

భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.

నెదర్లాండ్స్ మహిళల జట్టు: స్టెర్రే కాలిస్, సాన్య ఖురానా, ఫేబే మోల్కెన్‌బోయర్, బాబెట్ డి లీడే (కెప్టెన్/వికెట్ కీపర్), రోబిన్ రిజ్కే, ఐరిస్ క్విల్లింగ్, హీథర్ సీగర్స్, ఫ్రెడరిక్ ఓవర్‌డిజ్క్, కారోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్, ఇసాబెల్ వోనింగ్.

Read more Photos on
click me!

Recommended Stories