INDW vs AUSW: స్మృతి మంధాన సెంచరీ, అంపైర్ అవుట్ ఇవ్వకుండానే పెవిలియన్ చేరిన పూనమ్ రౌత్...

First Published Oct 1, 2021, 3:50 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చారిత్రక పింక్ బాల్ టెస్టుకి మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. రెండో రోజు వాన కారణంగా ఆటకు బ్రేక్ పడే సమయానికి  భారత జట్టు 101.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. 

యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 64 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి అవుట్ కాగా సంచలన బ్యాట్స్‌వుమెన్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది...

216 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 127 పరుగులు చేసిన స్మృతి మంధాన... పింక్ బాల్ టెస్టులో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది...

డే నైట్ టెస్టులో మొట్టమొదటి సెంచరీ చేసిన భారత పురుష క్రికెటర్ విరాట్ కోహ్లీ కాగా, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన... యాదృచ్ఛికంగా ఈ ఇద్దరి జెర్సీ నెంబర్ 18 కావడం విశేషం...

దాదాపు నాలుగేళ్ల తర్వాత సౌతాఫ్రికాపై తొలి టెస్టు మ్యాచ్ ఆడిన టీమిండియా, 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. చివరిసారిగా 2006లో జరిగిన టెస్టులో ఆడిన వారిలో కెప్టెన్ మిథాలీరాజ్, సీనియర్ పేసర్ జులన్ గోస్వామి మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు...

స్మృతి మంధానతో కలిసి రెండో వికెట్‌కి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పూనమ్ రౌత్, క్రీడాస్ఫూర్తిని చాటుకుంది. 165 బంతుల్లో 2 ఫోర్లతో 36 పరుగులు చేసిన పూనమ్ రౌత్‌ను అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, బంతి బ్యాటుని తాకిందని గ్రహించిన ఆమె స్వచ్ఛంధంగా పెవిలియన్ చేరింది..

కెప్టెన్ మిథాలీరాజ్ 86 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసి రనౌట్ కాగా, యషికా భాటియా 19 పరుగులు చేసి అవుట్ అయింది. దీప్తి శర్మ 12 పరుగులతో ఆడుతుండగా ఆమెతో పాటు వికెట్ కీపర్ తానియా క్రీజులో ఉన్నారు..

click me!