INDvsSL టీ20 ఫైనల్: భారత బ్యాట్స్‌మెన్ అట్టర్ ఫ్లాప్... ఫైనల్‌లో లంక ముందు...

First Published | Jul 29, 2021, 9:31 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీకి ముందు ఆఖరి టీ20 మ్యాచ్. రెండో మ్యాచ్‌లో లంక గెలవడంతో సిరీస్ దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఫైనల్ మ్యాచ్. అలాంటి మ్యాచ్‌లో టీమిండియా సీ జట్టు ఘోరమైన ప్రదర్శన ఇచ్చింది. కొన్నాళ్లుగా సరైన ఫామ్‌ అందుకోలేకపోతున్న లంక, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొట్టి భారత జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 81 పరుగులకే పరిమితం చేయగలిగారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. టీ20ల్లో మొదటి బంతికే డకౌట్ అయిన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు ధావన్.
ఇంతకుముందు భారత రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు సార్లు డకౌట్ అయినా ఎప్పుడూ మొదటి బంతికే అవుట్ కాలేదు. శిఖర్ ధావన్ అవుట్ కావడంతో భారత జట్టు వికెట్ల పతనం మొదలైంది...

15 బంతుల్లో 1 ఫోర్‌తో 9 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. పడిక్కల్‌‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసేందుకు బౌలర్ అప్పీలు చేస్తుండగా పరుగు కోసం ప్రయత్నించి ముందుకొచ్చి రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత సంజూ శాంసన్ కూడా డకౌట్ కాగా... రుతురాజ్ గైక్వాడ్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
నితీశ్ రాణా 15 బంతుల్లో 6 పరుగులు చేసి లంక కెప్టెన్ ధసున్ శనక బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాను భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఆరో వికెట్‌కి 19 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 32 బంతుల్లో 16 పరుగులు చేసిన భువనేశ్వర్ కుమార్, హసరంగ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
వరుణ్ చక్రవర్తి కూడా డకౌట్ కాగా కుల్దీప్ యాదవ్ 23 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చేతన్ సకారియా 5 పరుగులు చేసి 9వ వికెట్‌కి 17 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
శ్రీలంక బౌలర్లలో హసరంగ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.ధసున్ శనక రెండు, చమీరా, రమేష్ మెండీస్ తలా ఓ వికెట్ తీశారు.
మొదటి ఓవర్ నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో మెరుపులు, కళ్లుచెదిరే క్యాచులు అందుకున్న శ్రీలంక జట్టు, భారత బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పులు పెట్టింది.

Latest Videos

click me!