INDvsSA 2nd Test: ఒక్క దెబ్బకు మూడు రికార్డులు... రెండో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు...

First Published Jan 3, 2022, 10:13 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత తరంలో తిరుగులేని రికార్డుల రారాజు. ఫామ్‌లో లేకపోయినా విరాట్ కోహ్లీ రికార్డుల ప్రవాహ జోరు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. సౌతాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టులో విరాట్ కోహ్లీ కోసం మూడు రికార్డులు ఎదురుచూస్తున్నాయి...

జోహన్‌బర్గ్‌లోని ది వండరర్స్ స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా భారత జట్టు టెస్టు మ్యాచ్ ఓడిపోకపోవడం విశేషం...

1992, 1997, 2013 టెస్టు మ్యాచులను డ్రా చేసుకున్న భారత జట్టు, 2006లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో సఫారీ గడ్డపై తొలి టెస్టు విజయాన్ని అందుకుంది జోహన్‌బర్గ్‌లోనే...

2018లో మొదటి రెండు టెస్టులను ఓడిన విరాట్ కోహ్లీ, జోహన్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో 63 పరుగుల తేడాతో గెలిచి... సౌతాఫ్రికాలో కెప్టెన్‌గా తొలి టెస్టు విజయాన్ని అందుకున్నాడు...

విరాట్ కోహ్లీ రెండో టెస్టులో విజయాన్ని అందుకుంటే, సౌతాఫ్రికాలో ఒకే వేదికలో రెండు విజయాలు అందుకున్న మొట్టమొదటి సారథిగా రికార్డు క్రియేట్ చేస్తాడు విరాట్ కోహ్లీ...

ఇప్పటికే టెస్టుల్లో 40 విజయాలు అందుకుని, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమిండియా కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఓవరాల్‌గా అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న కెప్టెన్‌గా నాలుగో స్థానంలో ఉన్నాడు విరాట్...

జోహన్‌బర్గ్ మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని అందుకుంటే, 41 టెస్టు విజయాలతో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా రికార్డును సమం చేస్తాడు విరాట్ కోహ్లీ. ఆల్‌టైం మోస్ట్ సక్సెస్‌ఫుల్ టాప్ 3లోకి ఎంట్రీ ఇస్తాడు..

ది వండరర్స్ స్టేడియంలో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఇక్కడ ఆడిన రెండు టెస్టుల్లో 119, 96, 54,41 పరుగులతో 310 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జాన్ రీడ్ ఇక్కడ 316 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. మరో 7 పరుగులు చేసి విరాట్, జాన్ రీడ్ రికార్డును అధిగమిస్తాడు...

సౌతాఫ్రికాలో ఇప్పటిదాకా 6 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 611 పరుగులు చేశాడు. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సఫారీ గడ్డపై 11 మ్యాచులు ఆడి 624 పరుగులు చేశాడు... 

విరాట్ కోహ్లీ మరో 14 పరుగులు చేస్తే రాహుల్ ద్రావిడ్‌ను అధిగమిస్తాడు. అయితే టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాలంటే మాత్రం విరాట్ మరికొంత కాలం ఆగాల్సిందే...

సౌతాఫ్రికాలో 15 టెస్టు మ్యాచులు ఆడిన సచిన్ టెండూల్కర్ 1,161 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. మరో 14 పరుగులు చేస్తే ద్రావిడ్‌ని అధిగమించే విరాట్ కోహ్లీ, సచిన్ రికార్డును చేరుకోవాలంటే మరో 500 పరుగులు చేయాల్సి ఉంటుంది...

click me!