ఈ వయసులో అలా చేస్తాడని ఊహించలేదు... ఎంత టాలెంట్ ఉండి మాత్రం ఏం లాభం...

First Published Jan 2, 2022, 6:55 PM IST

స్టార్ బ్యాట్స్‌మెన్, సత్తా ఉన్న ప్లేయర్లు, వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నప్పటికీ టాప్ టీమ్‌గా నిలవలేకపోయింది సౌతాఫ్రికా. ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిన సఫారీ జట్టుకి ఆటగాళ్ల సడెన్ రిటైర్మెంట్ నిర్ణయాలు కొత్తేమీ కాదు...

2019 వన్డే వరల్డ్‌కప్ కోసం యమా బిజీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌‌ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించి, సౌతాఫ్రికాకి ఊహించని షాక్ ఇచ్చాడు ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్...

ఆ షాక్ నుంచి కోలుకోవడానికి సౌతాఫ్రికాకి దాదాపు రెండేళ్లు పట్టింది. టెస్టుల్లో ఆడపాదడపా విజయాలు సాధిస్తూ, ఇప్పుడిప్పుడే కాస్త బెటర్ పర్ఫామెన్స్ ఇస్తోందని సంతోషించేలోపు... క్వింటన్ డి కాక్ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించాడు...

2021 ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా జట్టుకి టెస్టు కెప్టెన్‌గా ఉన్న క్వింటన్ డి కాక్, ఏడాది చివరకు వచ్చే సరికి టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేశాడు...

క్వింటన్ డి కాక్ భార్య త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. బిడ్డ పుట్టిన తర్వాత తనతో, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు డి కాక్...

‘29 ఏళ్ల వయసులో ఎంతో సత్తా ఉన్న క్వింటన్ డి కాక్ లాంటి ప్లేయర్, ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవ్వరూ ఊహించరు. మేమంతా అతని నిర్ణయం విని షాక్ అయ్యాం...

అయితే అతని కారణాలు, అతనికున్నాయి. డి కాక్ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. అయితే సిరీస్ మధ్యలో ఇలా ప్రకటించడం జట్టుపై ఎఫెక్ట్ చూపించే అవకాశం లేకపోలేదు...

అందుకే ఈ విషయాన్ని మరిచిపోయి ప్లేయర్లు, పూర్తి ఫోకస్‌తో ఆడాల్సిన అవసరం ఉంది. డి కాక్ టెస్టు కెరీర్ అద్భుతంగా సాగింది...

24 ఏళ్ల కేల్ వెరెన్నే, మిగిలిన టెస్టుల్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా వ్యవహరించబోతున్నాడు. అతని టాలెంట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బ్రౌచర్...

click me!