నీ దూకుడు.. సాటెవ్వడు.. ఉమ్రాన్ స్పీడ్‌కు లంక విలవిల.. వన్డేలలో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు

Published : Jan 11, 2023, 10:24 AM IST

Umran Malik Fastest Ball: జట్టులోకి వచ్చినప్పట్నుంచి వేగాన్ని నమ్ముకుని  ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న టీమిండియా యువ పేసర్  ఉమ్రాన్ మాలిక్ తాజాగా మరో రికార్డు నెలకొల్పాడు. 

PREV
16
నీ దూకుడు.. సాటెవ్వడు.. ఉమ్రాన్ స్పీడ్‌కు లంక విలవిల.. వన్డేలలో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు

ఐపీఎల్‌లో అదరగొట్టి  ఆ తర్వాత  జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా  యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్  రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. నిఖార్సైన పేసర్ కోసం వెతుకుతున్న భారత క్రికెట్ జట్టుకు  నేనున్నానంటూ వచ్చిన ఉమ్రాన్.. లంకతో  టీ20 సిరీస్ తో పాటు వన్డేలలో కూడా  రెచ్చిపోతున్నాడు.  

26

నిన్న గువహతి వేదికగా ముగిసిన తొలి వన్డేలో  ఉమ్రాన్ మాలిక్ విసిరిన బంతి  ఏకంగా 156 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. లంక ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో  (ఉమ్రాన్ కు రెండో ఓవర్)   అతడు వేసిన నాలుగో బంతి   వేగం స్పీడో మీటర్ లో  గంటకు  156 కి.మీ.ల వేగంతో వచ్చిందని నమోదైంది. 

36

ఇటీవలే లంకతో టీ20లలో  155 కి.మీ. ల వేగంతో బంతులను సంధించిన ఈ జమ్మూ ఎక్స్‌ప్రెస్.. తాజాగా తొలి వన్డేలో కూడా అదే జోరు చూపించాడు.   టీ20లలో ఈ వేగంతో బంతిని విసిరిన బౌలర్ ఉమ్రాన్ ఒక్కడే కావడం గమానార్హం.  అలాగే ఐపీఎల్ లో కూడా ఉమ్రాన్ మాలిక్.. 157 కి.మీ. వేగం నమోదుచేసిన విషయం తెలిసిందే.  

46

భారత్ తరఫున అంతర్జాతీయ  మ్యాచ్ లలో  అత్యధిక వేగంతో బంతులు సంధించిన వారి జాబితా ఇలా  ఉంది.  టెస్టులలో డేవిడ్ జాన్సన్.. 157.8 కి.మీ. (1996లొ ఆస్ట్రేలియాపై) వేగంతో బంతిని విసరగా వన్డేలలో జవగల్ శ్రీనాథ్ (1997లో జింబాబ్వేపై) గంటకు 157 కి.మీ. వేగంతో బాల్ వేశాడు.  ఆ తర్వాత జాబితాలో ఉమ్రాన్ (156 కి.మీ) నిలిచాడు. టీ20లలో ఉమ్రాన్ (155) దే రికార్డు. ఐపీఎల్ లో కూడా భారత్ తరఫున అత్యధిక వేగంతో బంతిని విసిరింది (157 కి.మీ) అతడే. 

56

కాగా నిన్నటి మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్.. 8 ఓవర్లు విసిరి 57 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.  తొలుత బాగానే బౌలింగ్ చేసినా చివర్లో శనక పవర్ ప్లే  ను ఉపయోగించుకుని ఉమ్రాన్ బౌలింగ్ లో  భారీ షాట్లు ఆడాడు. 
 

66

శ్రీలంకతో మ్యాచ్ లో  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.  విరాట్ కోహ్లీ (113) సెంచరీ  చేయగా రోహిత్ శర్మ (83), శుభమన్ గిల్ (70) రాణించారు.  ఆ తర్వాత భారత బౌలర్లు లంకను 306 పరుగులకే కట్టడి చేశారు. ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయింది. చివర్లో దసున్ శనక (108) మెరుపులు మెరిపించాడు. 

click me!

Recommended Stories