టీమిండియాకి భారంగా మారిన ఛతేశ్వర్ పూజారా... ఆ ప్లేస్ కోసం నలుగురి మధ్య పోటీ...

Published : Aug 13, 2021, 04:34 PM IST

టెస్టు ఫార్మాట్‌లో టీమిండియాకి వెన్నెముక లాంటి ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా. రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టుకి దొరికిన ఆణిముత్యం. అయితే ఇప్పుడీ క్లాస్ ప్లేయర్‌, తీవ్రమైన ఒత్తిడిలో కనిపిస్తున్నాడు..

PREV
114
టీమిండియాకి భారంగా మారిన ఛతేశ్వర్ పూజారా... ఆ ప్లేస్ కోసం నలుగురి మధ్య పోటీ...

ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఛతేశ్వర్ పూజారా. ముఖ్యంగా గబ్బా టెస్టులో వికెట్లకు అడ్డంగా తన శరీరాన్ని పెట్టి, ఆసీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు పూజారా...

214

ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఛతేశ్వర్ పూజారా. ముఖ్యంగా గబ్బా టెస్టులో వికెట్లకు అడ్డంగా తన శరీరాన్ని పెట్టి, ఆసీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు పూజారా...

314

అత్యంత సాహసోపేతమైన ఆ ఇన్నింగ్స్ కారణంగానే ఓ ఎండ్‌లో శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగి భారత జట్టుకి చారిత్ర క విజయాన్ని అందించారు...

414

గబ్బాలో భారత జట్టు అద్వితీయ విజయం సాధించిన తర్వాత ఛత్వేశ్వర్ పూజారా ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అది జరిగి ఆరు నెలలు కూడా గడవకముందే పూజారా, భారత జట్టుకి భారంగా మారాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

514

పూజారాపై ఈ రేంజ్‌లో ట్రోల్స్ రావడానికి ప్రధాన కారణం ‘ది గ్రేట్ గబ్బా’ ఇన్నింగ్స్ తర్వాత అతని నుంచి ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఒక్కటి కూడా రాకపోవడమే. గత 30 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ చేయలేకపోయిన పూజారా... గత 10 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ మార్కు కూడా అందుకోలేకపోయాడు...

614

స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన పూజారా... డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

714

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పూజారా జిడ్డు బ్యాటింగ్‌పై తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేశాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ... ‘అవుట్ కాకుండా ఉండాలని మాత్రమే బ్యాటింగ్ చేస్తే, పరుగులు రావాలి... క్రీజులో ఉన్నప్పుడు పరుగులు చేయాలనే ఆలోచన కూడా ఉండాలని’ కామెంట్ చేశాడు కోహ్లీ...

814

పూజారాపై కోహ్లీ చేసిన కామెంట్లతో ఇంగ్లాండ్ టూర్‌లో అతనికి అవకాశం దక్కకపోవచ్చని అనుకున్నారంతా. అయితే ‘మోడ్రన్ వాల్’కి మరో ఛాన్స్ ఇవ్వాలని విరాట్ అండ్ టీమ్ మేనేజ్‌మెంట్ భావించినట్టు తెలుస్తోంది...

914

అయితే తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరిన పూజారా, రెండో ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లతో 12 పరుగులు చేసి జోరు మీదున్నట్టు కనిపించాడు. అయితే వర్షం కారణంగా ఐదో రోజు ఆట రద్దు కావడంతో పూజారాకి నిరూపించుకునే ఛాన్స్ దక్కలేదు...

1014

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే అవుటైన పూజారా... మరోసారి ట్రోల్స్‌కి టార్గెట్ అయ్యాడు. ఇక అతనికి మరో ఛాన్స్ దక్కాలంటే... రెండో ఇన్నింగ్స్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాల్సిందే...

1114

ఇప్పటికే ఏరీకోరీ పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్‌లను ఇంగ్లాండ్‌కి రప్పించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆ ఇద్దరూ పూజారా ప్లేస్‌‌లో ఆడేందుకు పోటీపడుతున్నారు... కెఎల్ రాహుల్ ఫెయిల్ అయి ఉంటే, ఆ ప్లేస్‌లో పృథ్వీషా ఆడేవాడు. ఇప్పుడు ఆ ప్లేస్‌కి రాహుల్ ఫిక్స్, ఇప్పుడు పృథ్వీషా కోసం వన్‌డౌన్‌ ప్లేస్ కోసం పోటీపడాల్సిందే.

1214

INDvsENG Test Series

1314

ఇంత మంది ప్లేయర్లు, తుదిజట్టులో ప్లేస్ కోసం వెయిట్ చేస్తుంటే... వరుసగా విఫలమవుతున్న పూజారాకి మరో ఛాన్స్ ఇచ్చి, అది టీమిండియా విజయావకాశాలను దెబ్బ తీస్తే... కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది...

1414

దీంతో మూడో టెస్టులో లేదా నాలుగో టెస్టులో ఛతేశ్వర్ పూజారా స్థానంలో మరో ప్లేయర్ ఆడడం ఖాయమని అనుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... రహానే కూడా ఇలాంటి రిస్క్‌లోనే ఉన్నాడు.

click me!

Recommended Stories