ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయకుంది... నేటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మూడు మార్పులతో, భారత జట్టు ఒక మార్పుతో బరిలో దిగుతోంది.
తొలి టెస్టులో విజయం అంచుల దాకా వచ్చిన టీమిండియా.. వర్షం కారణంగా ఫలితం తేలకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది... అయితే నాలుగు రోజుల పాటు ఆతిథ్య జట్టుపై ఆధిక్యం చూపించిన భారత జట్టు ఫుల్లు జోష్‌లో కనిపిస్తోంది...
27
అయితే భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే ఫామ్ టీమిండియా అభిమానులను కలవరబెడుతోంది. ఈ ముగ్గురూ ఫామ్‌లోకి వస్తే టీమిండియాకి విజయం దక్కడం పెద్ద కష్టమేమీ కాదు...
37
మొదటి టెస్టులో గాయపడిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే బరిలో దిగుతోంది టీమిండియా...
47
మరోవైపు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయంతో బాధపడుతుండడంతో అతని స్థానంలో మార్క్ వుడ్‌కి స్థానం దక్కింది... మరో రెండు మార్పులు చేసిన ఇంగ్లాండ్ లారెన్స్ స్థానంలో మొయిన్ ఆలీకి, క్రావ్లీ స్థానంలో హమీద్‌కి అవకాశం ఇచ్చింది.
57
తొలి టెస్టును ఫలితం తేలకుండా చేసిన వర్షం... రెండో టెస్టును వదిలిపెట్టేలా కనిపించడం లేదు. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఆకాశం మబ్బులతో కమ్ముకుని ఉండడంతో నేడు మ్యాచ్ ప్రారంభమైనా, సజావుగా సాగడం అనుమానంగానే మారింది...