టీమిండియా సిరీస్ గెలవాలంటే అశ్విన్ ఆడాల్సిందే... మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కామెంట్...

First Published Aug 11, 2021, 4:13 PM IST

తొలి టెస్టులో విజయం అంచుల దాకా వచ్చినా, వరుణుడి కారణంగా మ్యాచ్‌ను దక్కించుకోలేకపోయింది టీమిండియా. రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్ ఆల్‌రౌండర్ లేకుండా బరిలో దిగిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించింది...

రెండో ఇన్నింగ్స్‌లో కీలక వికెట్లు తీసే అశ్విన్ లేకపోవడం వల్ల 303 పరుగుల భారీ స్కోరు చేసింది ఇంగ్లాండ్. అయితే అదృష్టవశాత్తు టీమిండియాకి తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల ఆధిక్యం దక్కడంతో టార్గెట్ చిన్నదైపోయింది... 

అయితే తొలి టెస్టులో లక్కీగా ఫాస్ట్ బౌలర్లు రాణించడంతో బతికిపోయినా, టెస్టు సిరీస్ గెలవాంటే మాత్రం రవిచంద్రన్ అశ్విన్ ఆడాల్సిందేనని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

తొలి టెస్టులో అశ్విన్‌కి రెస్టు ఇచ్చిన టీమిండియా.. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌లతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకి ఛాన్స్ ఇచ్చింది..

జడేజా రెండు ఇన్నింగ్స్‌లో బాల్‌తో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా... బ్యాటింగ్‌లో అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు...

‘టీమిండియా ఐదు బౌలర్లతో బరిలో దిగుతూ, బ్యాటింగ్‌లో రాజీ పడకుండా ఆడాలని చూస్తోంది. ఇది మంచిదే కానీ రవిచంద్రన్ అశ్విన్ కూడా బాగా బ్యాటింగ్ చేయగలడు...

అతనికి టెస్టుల్లో నాలుగు సెంచరీలున్న విషయం మరిచిపోకూడదు. టీమిండియా టెస్టు సిరీస్ గెలవాలంటే అశ్విన్ లాంటి స్టార్ ఆల్‌రౌండర్‌కి జట్టులో చోటు ఇవ్వాల్సిందే...

శార్దూల్ ఠాకూర్ స్థానంలో అశ్విన్ ఆడిస్తే బెటర్... లార్డ్స్ లాంటి పిచ్‌లో అశ్విన్ చక్కని ప్రదర్శన ఇవ్వగలడు. ఇప్పటికే ఈ మైదానంలో ‘ది హండ్రెడ్’ టోర్నీ ఆడారు. కాబట్టి స్పిన్‌కి చక్కగా సహకరించవచ్చు...

లార్డ్స్ టెస్టు ఐదు రోజుల పాటు సాగినా సాగకపోయినా... అశ్విన్‌ను ఆడించడం వల్ల టీమిండియాకి అన్ని విధాల కలిసి రావచ్చు.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగుతున్నారు కాబట్టి ఇషాంత్ శర్మ కొంత కాలం వేచి చూడక తప్పదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

తొలి టెస్టులో జో రూట్‌తో పాటు కీలక సమయంలో బట్లర్ వికెట్ తీసిన స్వింగ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్... గాయంతో బాధపడుతున్నాడు. అతను రెండో టెస్టుకి అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం...

శార్దూల్ ఠాకూర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఆడించాలని కొందరు అంటుంటే... ఇషాంత్ శర్మ లేదా ఉమేశ్ యాదవ్ వంటి ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇస్తే మంచిదని మరికొందరు అంటున్నారు...

click me!